
మా త్రివిక్రమ్ గారు చెప్పినట్టు “శత్రువులు ఎక్కడో ఉండరు .. మారు వేషాలు వేసుకుని మన ఎదురుకుండానే తిరుగుతూ ఉంటారు.” అన్న డైలాగ్ కి తగ్గట్లే ప్రవర్తిస్తున్నాడు రాం గోపాల్ వర్మ. ఇప్పటికే వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, లాంటి వివాదాస్పద చిత్రాలు తీసిన వర్మ ఇప్పుడు “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు”, సినిమాలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా టార్గెట్ చేసాడు. రాజకీయ అంశాలు, వాస్తవ సంఘటనలను సినిమాలలో చూపించే వర్మ, ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇంకా దారుణంగా తెలుగుదేశం పార్టీ మీద ట్రోల్ చేస్తూ, సినిమా చేస్తున్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, పేరు, గుర్తింపు ఉన్న నటులు ఎవరూ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నటించే సాహసం చెయ్యలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పెద్ద నటులు కూడా, ఇప్పుడు వర్మ తీసే చిత్రాలలో నటిస్తున్నారు.
తాజాగా రాం గోపా వర్మ చేస్తున్న, కమ్మ రాజ్యం లో కడప రెడ్లు సినిమాకు సంబంధించిన ఇక పాటను రిలీజ్ చేసారు. అందులో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ను దారుణంగా ఎగతాళి చేసారు. “పప్పు లాంటి అబ్బాయి” అనే పాటను పాత సినిమాలలో అందరికీ గుర్తు ఉన్న “చుక్క లాంటి అమ్మాయి – చక్కనైన అబ్బాయి” అనే ట్యూన్ లో చేసారు. సినిమా ఇండస్ట్రీ లో రోజులు గడిచే కొద్దీ, రాజమౌళి లాంటి వాళ్ళు దేశం గర్వించే సినిమాలు చేస్తూ ఉంటే, వర్మ మాత్రం ఇంకా దిగజారిపోతున్నారు అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Here is an audio teaser for PAPPU LAANTI ABBAYI song from KAMMA RAJYAMLO KADAPA REDDLU ..Full video song releasing dayafter 10 th 9.36 Am in PARAMA BRAHMA MUHURTHAM #KRKR https://t.co/BM0zVgOCYU pic.twitter.com/CbjAdenGqe
— Ram Gopal Varma (@RGVzoomin) November 8, 2019