
వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ చెప్పినట్లుగానే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే పాటని ఈరోజు విడుదల చేసాడు . చంద్రబాబు , జగన్ , పవన్ కళ్యాణ్ ల విజువల్స్ తో ఈ పాట ని నింపేసాడు . ఈ విజువల్స్ లో చంద్రబాబు బేలతనం , జగన్ రాజసం , పవన్ కళ్యాణ్ నిర్వేదం వెరసి వర్మ పైత్యం తో కొనసాగింది టైటిల్ సాంగ్ .
కమ్మరాజ్యం …… కమ్మరాజ్యం అంటూ బాగానే ఉడికిస్తున్నాడు వర్మ . ఈ సినిమా ఎప్పుడు , ఎక్కడ షూటింగ్ జరుగుతుందో కానీ టైటిల్ సాంగ్ మాత్రం విడుదల చేసాడు . ఈ పాట పెద్ద వివాదాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది . చెప్పినట్లుగానే కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల చేసేలా ఉన్నాడు వర్మ . అంటే మళ్ళీ సొమ్ము చేసుకునే పరిస్థితి అన్నమాట .
- Advertisement -
- Advertisement -