
ప్రస్తుతం ఉంటున్న ఇంటిని తక్షణం ఖాళీ చేయాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు ఎంపీ విజయసాయి రెడ్డి . ప్రస్తుతం చంద్రబాబు నాయుడు లింగమనేని ఎస్టేట్ లో ఉంటున్న విషయం తెలిసిందే . ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు , అయితే కరకట్ట కు ముందు కట్టిన అక్రమ కట్టడమని తెలిసి కూడా చంద్రబాబు ఆ ఇంట్లో ఉంటున్నాడని కాబట్టి తక్షణం ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్ చేసాడు విజయసాయి రెడ్డి .
లింగమనేని ఎస్టేట్ ని కూడా కూల్చడం ఖాయమని , ప్రభుత్వం జోక్యం చేసుకోకముందే హుందాగా ఖాళీ చేస్తే గౌరవంగా ఉంటుందని , లేకపోతే అవమానం తప్పదని హెచ్చరికలు జారీ చేసాడు విజయసాయి రెడ్డి . జగన్ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే చంద్రబాబుని లింగమనేని ఎస్టేట్ నుండి కూడా తరిమేలా కనిపిస్తున్నారు . ఇప్పటికే ప్రజావేదిక ని కుప్పకూల్చిన విషయం తెలిసిందే .