Homeటాప్ స్టోరీస్రేవంత్ పక్కన ఉంటే హరీష్ రావు చచ్చేవాడట

రేవంత్ పక్కన ఉంటే హరీష్ రావు చచ్చేవాడట

Revanth reddy sensational comments on harish rao వంద రూపాల పెట్రోల్ కొనుక్కున్నాడు కానీ పది పైసల అగ్గిపెట్టె కొనుక్కోలేదని అందుకే హరీష్ రావు బతికి బట్టగలిగిండని నా లాంటోడు హరీష్ పక్కన ఉంటే అప్పుడే సచ్చిపోయేటోడని సంచలన వ్యాఖ్యలు చేసాడు డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి . 2009 లో ఉద్యమ సమయంలో హరీష్ రావు ఒంటి మీద పెట్రోల్ పోసుకున్న విషయం తెలిసిందే . అయితే వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొన్న హరీష్ రావు పది పైసల అగ్గిపెట్టె ఎందుకు కొనలేదని ,యువతని రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ఉసిగొల్పారని , ఉద్యమం లో పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి కేసిఆర్ కుటుంబం మాత్రమే పదవులు అనుభవిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు రేవంత్ రెడ్డి .

కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల కేసిఆర్ గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయని అందుకే చంద్రబాబు పై , రాహుల్ గాంధీ పై విమర్శలు చేస్తున్నారని , మహాకుటమి మీకు పోటీ కానప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందని ,మాపై విమర్శలు చేయాల్సిన పని లేదు కదా ! అంటూ కేటిఆర్ ని సూటిగా ప్రశ్నిస్తున్నాడు రేవంత్ . తెలంగాణ తాగుబోతుల రాజ్యం గా తయారయ్యిందని అందుకే కేసిఆర్ ని గద్దె దించడానికే మహాకుటమి ఏర్పడిందని , ప్రజలు కేసిఆర్ ని తన్ని ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని అంటున్నాడు రేవంత్ రెడ్డి .

- Advertisement -

English Title: Revanth reddy sensational comments on harish rao

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All