Homeన్యూస్మినిస్టర్ హరీష్ రావు విడుదల చేసిన "ఒకటే లైఫ్" ట్రైలర్

మినిస్టర్ హరీష్ రావు విడుదల చేసిన “ఒకటే లైఫ్” ట్రైలర్

minister harish rao released okate life trailerసూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం’ ఒకటే లైఫ్’ .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రదాన పాత్రలో కన్పించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను హరీష్ రావు విడుదల చేశారు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. “ఒకటే లైఫ్ చిత్రాన్ని దర్శకనిర్మాతలు అద్భుతంగా తెరకెక్కించారు. పాటలు బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకొనే విధంగా ఉంది. డైరెక్టర్ వెంకట్ తన తొలి సినిమాలా కాకుండా అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకొంటున్నాను” అన్నారు.

- Advertisement -

దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. టెక్నాలజీ పేరుతో పరుగులెడుతొన్న నేటి తరం హ్యూమన్ రిలెషన్స్ కు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో యూత్ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రమిది. సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు. అమ్రీష్ అందించిన పాటలకు ఆదరణ బాగుంది. ఆర్. ఆర్. కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది” అన్నారు.

నిర్మాత నారాయణ్ రామ్ మాట్లాడుతూ.. “సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్ గా నిలుస్తుంది. సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హరీష్ రావుగారు మా ట్రైలర్ ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

జితన్ రమేష్, శృతియుగల్, సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి ,శ్యామ్ ,దిశ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్ , కూర్పు: నందమూరి హరి, ఆర్ట్: విజయ్ కృష్ణ , పి.ఆర్.ఓ: సాయి సతీష్, కెమెరా: వై.గిరి, రచన: సతీష్ బండోజీ , దర్శకత్వం : ఎం.వెంకట్, నిర్మాత : నారాయణ్ రామ్

English Title: minister harish rao released okate life trailer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All