Homeటాప్ స్టోరీస్కేసిఆర్ కు ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసా

కేసిఆర్ కు ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసా

Telangana elections sarvey : KCR looser , mahakutami winnerతెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ మళ్ళీ అధికార పీఠం చేపట్టడం అంత సులువు కాదని ,అధికారం మహాకుటమి కి అప్పగించడం ఖాయమని అంటోంది ది ఎకనామిక్ టైమ్స్ , ఎకనామిక్ నౌ చానల్ . తెలంగాణ రాష్ట్ర సమితి కి కేవలం 35 నుండి 40 సీట్లు మాత్రమే వస్తాయని అదే మహాకుటమికి 67 నుండి 81 సీట్ల వరకు వస్తాయని సర్వే తేల్చి పడేసింది . ఇక కేంద్రంలో అధికారం వెలగబెడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే ……. ఆశ్చర్యకరమైన ఫలితాలను అందుకోబోతున్నాం అంటూ బీరాలు పలుకుతున్న భారతీయ జనతా పార్టీ కి ఇక్కడ చేదు అనుభవం ఎదురు కానుంది . ఒక్క సీటు కూడా తెలంగాణలో రావడం లేదట బిజెపికి . సున్నా అని తేల్చేసింది సర్వే , ఇకపోతే ఎం ఐ ఎం కు మాత్రం మంచి రోజులే వస్తున్నాయి ఎందుకంటే ఆ పార్టీకి దాదాపు పది సీట్లు రావచ్చు అని అంచనా వేసింది . మినిమం 5 కాగా అత్యధికంగా 10 స్థానాల వరకు గెల్చుకునే సత్తా ఉందని తేల్చింది .

కాంగ్రెస్ పార్టీ , తెలుగుదేశం పార్టీ లు తమ సిద్దాంతాలను పక్కన పెట్టి కేసిఆర్ ను గద్దె దించడానికి నడుం కట్టాయి కాగా వాళ్ళ కోరిక నెరవేరేలా ఉందని ఈ సర్వే చెబుతోంది . 9 నెలలు ఇంకా అధికారం చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు పోయి చాలా పెద్ద తప్పు చేసాడని అందుకే తగిన మూల్యం చెల్లిస్తున్నాడని కేసిఆర్ పై వ్యాఖ్యలు చేస్తున్నారు . మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లో జరగబోయే ఎన్నికల్లో మహాకుటమి అధికారం చేపట్టడం ఖాయమని కేసిఆర్ కు ఝలక్ ఇవ్వడం ఖాయమని ది ఎకనామిక్ టైమ్స్ తేల్చింది .

- Advertisement -

English Title: Telangana elections sarvey : KCR looser , mahakutami winner

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All