Homeటాప్ స్టోరీస్హలో గురూ ప్రేమకోసమే రీ షూట్

హలో గురూ ప్రేమకోసమే రీ షూట్

ree shoot mode in hello guru prema kosameరామ్ హీరోగా నటిస్తున్న హలో గురూ ప్రేమకోసమే చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది అయితే కొన్ని సన్నివేశాలు అస్సలు బాగారాలేదట దాంతో నిర్మాత దిల్ రాజు దర్శకుడికి చివాట్లు పెట్టి మళ్ళీ రీ షూట్ చేయమని ఆఙ్ఞాపించాడట ! దాంతో హలో గురూ ప్రేమకోసమే చిత్రం రీ షూట్ జరుపుకుంటోందట . రామ్ హీరోగా నటిస్తుండగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది అలాగే కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు . వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు దిల్ రాజు కు నచ్చలేదట అందుకే రీ షూట్ చేయమని ఆదేశాలు జారీ చేసాడట .

దిల్ రాజుకు ఇప్పటికే రెండు సినిమాలు పెద్ద దెబ్బ కొట్టాయి ఇక ఇది కూడా దెబ్బ కొడితే హ్యాట్రిక్ పూర్తయినట్లే అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నాడట అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలనీ పట్టుదలగా ఉన్నాడట ఎందుకంటే ఆ సమయంలో విడుదల చేస్తే దసరా సెలవులు పది రోజులపైనే ఉంటాయి కాబట్టి సొమ్ము చేసుకోవచ్చు అని భావిస్తున్నాడట . వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి హలో గురూ ప్రేమకోసమే తప్పకుండా హిట్ కొట్టాలని చూస్తున్నాడు దిల్ రాజు .

- Advertisement -

English Title: ree shoot mode in hello guru prema kosame

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All