
మాస్ మహారాజా రవితేజ `క్రాక్` బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశారు. ఈ మూవీ సక్సెస్‌తో మాంచి జోష్‌మీదున్న రవితేజ ఇదే ఊపులో `ఖిలాడీ` చిత్రాన్ని పట్టాలెక్కించారు. రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రవితేజ నటిస్తున్న తొలి యాక్షన్ థ్రిల్లర్. కోనేరు సథ్యనారాయణ నిర్మిస్తున్న ఈ మూవీలో రవితేజ ద్యుయల్ రోల్‌లో నటిస్తున్నారు.
మీనాక్షీచౌదరి, డింపుల్ హయాతీ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇటీవలే ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియ ఆ తిరిగి వచ్చిన చిత్ర బృందం సోమవారం ఈ మూవీ టీజర్‌ని ఉగాది సందర్భంగా రిలీజ్ చేసింది. విలన్ ఛాయలున్న పాత్రలో సైకో కిల్లర్‌గా రవితేజ కనిపించనున్నఈ మూవీ టీజర్ కొత్తగా వుంది. `ఇఫ్ యు ప్లే స్మార్ట్ అవుట్ స్టుడిప్ ఎమోషన్స్ యు ఆర్ అన్ స్టాపబుల్` అంటూ రవితేజ చెబుతున్న డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా వుంది.
హ్యామర్ తో హత్యలు చేసే సైకో కిల్లర్‌గా రవితేజ పాత్ర కొత్తగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీని హ్యామర్‌తో కొట్టి చంపుతున్న విజువల్స్ సినిమాతో రవితేజ పోషిస్తున్న సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఓ సైకో కిల్లర్ అని తెలుస్తోంది. టెర్రిఫిక్ విజువల్స్‌కి దేవి అందించిన నేపథ్య సంగీతం ప్రాణం పోసినట్టుగా కనిపిస్తోంది. రవితేజతో పాటు దేవిశ్రీప్రసాద్ చేస్తున్న తొలి థ్రిల్లర్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.