Homeటాప్ స్టోరీస్`ఖిలాడీ`.. గుడ్ మెన్ వ‌ర్సెస్ బ్యాడ్‌మెన్‌!

`ఖిలాడీ`.. గుడ్ మెన్ వ‌ర్సెస్ బ్యాడ్‌మెన్‌!

`ఖిలాడీ`.. గుడ్ మెన్ వ‌ర్సెస్ బ్యాడ్‌మెన్‌!
`ఖిలాడీ`.. గుడ్ మెన్ వ‌ర్సెస్ బ్యాడ్‌మెన్‌!

మాస్ రాజా ర‌వితేజ స్పీడు పెంచారు. వ‌రుస సినిమాల‌తో మాంచి జోరుమీదున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్‌` సంక్రాంతికి విడుద‌ల కాబోతుండ‌గా మ‌ర‌నో చిత్రం `ఖిలాడీ` సెట్స్‌పై వుంది. ఇందులో ర‌వితేజ ద్విపాత్రాభ‌యం చేస్తున్నారు. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై కోనేరు స‌త్యానారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీనాక్షీ చౌద‌రి, డింపుల్ హ‌యాతీ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా శుక్ర‌వారం ఈ చిత్ర బృందం కొత్త పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌తో ర‌వితేజ డ్యుయ‌ల్ రోల్‌లో న‌టిస్తున్న‌ట్టు చిత్ర బృందం క‌న్ఫ‌ర్మ్ చేసింది. ఇందులో ఓ పాత్ర గుడ్ మెన్‌గా, మ‌రో పాత్ర బ్యాడ్‌మెన్‌గా క‌నిపిస్తోంది. గుడ్ మెన్‌కు బ్యాడ్‌మెన్ గ‌న్ పెట్టి బెదిరిస్తున్న తీరు సినిమా ఎలా వుంటుంద‌నే ఊహాగానాల‌కు క్లారిటీ ఇచ్చేస్తోంది.  ‌

- Advertisement -

థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ఆడియ‌న్స్‌కి స‌రికొత్త అనుభూతిని అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చేసింది. దీంతో సంక్రాంతికి `క్రాక్‌`తో వ‌స్తున్న మాస్ రాజా స‌మ్మ‌ర్ స్లాట్‌ని కూడా పూర్తిగా వినియోగాంచుకోబోతున్నాడ‌ని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All