Homeటాప్ స్టోరీస్ర‌వితేజ కోసం రంగంలోకి వెంకీ మామ‌‌!

ర‌వితేజ కోసం రంగంలోకి వెంకీ మామ‌‌!

ర‌వితేజ కోసం రంగంలోకి వెంకీ మామ‌‌!
ర‌వితేజ కోసం రంగంలోకి వెంకీ మామ‌‌!

స్టార్ హీరోకు అండ‌గా నిల‌బ‌డ‌టం కోసం మ‌రో స్టార్ హీరో వ‌స్తుంటారు. తెరపై ఎంత పోటీ వున్నా మ‌న టాలీవుడ్ స్టార్స్ మ‌ధ్య మంచి స్నేహ భావం వుంటుంద‌న్న‌ది చాలా సంద‌ర్భాల్లో స్ప‌ష్ట‌మైంది. తాజాగా స్టార్ హీరో మాస్ మ‌హారాజా ర‌వితేజ కోసం విక్ట‌రీ వెంక‌టేష్ రంగంలోకి దిగారు. వివ‌రాల్లోకి వెళితే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న ఈ చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేయ‌బోతోంది. ర‌వితేజ ప‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం కోసం హీరో విక్ట‌రీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్ అందిస్తున్నారు.

- Advertisement -

ఈ విష‌యాన్ని చిత్ర బృందం గురువారం సాయంత్రం అధికారికంగా ప్ర‌క‌టించింది. విక్ట‌రీ వెంక‌టేష్ డ‌బ్బింగ్ చెబుతున్న పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు విక్ట‌రీ వెంక‌టేష్ అందిస్తున్న వాయిస్ ఓవ‌ర్ ప్ర‌త్యేకంగా నిలుస్తుంద‌ని, సినిమాకు మ‌రింత‌ ప్ల‌స్ అవుతుంద‌ని చిత్ర బృందం భావిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All