Homeటాప్ స్టోరీస్ర‌వితేజ కోసం ఒకే ఒక్క‌డు వ‌చ్చేస్తున్నాడా?

ర‌వితేజ కోసం ఒకే ఒక్క‌డు వ‌చ్చేస్తున్నాడా?

ర‌వితేజ కోసం ఒకే ఒక్క‌డు వ‌చ్చేస్తున్నాడా?
ర‌వితేజ కోసం ఒకే ఒక్క‌డు వ‌చ్చేస్తున్నాడా?

`బెంగాల్ టైగ‌ర్‌` త‌రువాత‌ కొంత విరామం తీసుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం స్పీడు పెంచారు. త‌ను న‌టించిన ఓ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతుండ‌గానే బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్ని లైన్‌లో పెట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌వితేజ న‌టిస్తున్న మూవీ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ ఈ సంక్రాంతికి బ‌రిలో నిల‌వ‌బోతోంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ డేట్‌ని కూడా ప్ర‌క‌టించేశారు.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత `ఖిలాడీ` మూవీ చేస్తున్నారు. ర‌మేష్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌, జ‌యంతీలాల్ గ‌డ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ర‌వితేజ‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, మీనాక్షీ చౌద‌రి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది.

- Advertisement -

ఇందులో విల‌న్‌గా ఒకే ఒక్క‌డు యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. స్టైలిష్ విల‌న్‌గా అర్జున్ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా వుంటుంద‌ని చెబుతున్నారు. స్టోరీ కొత్త‌గా వుండ‌టంతో అర్జున్ ఈ మూవీలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఇంత‌కు ముందు అర్జున్ స్టైలిష్ విల‌న్‌గా విశాల్ న‌టించిన `అభిమ‌న్యు` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All