Homeటాప్ స్టోరీస్రవితేజ మార్కెట్ పడిపోయినట్లేనా ?

రవితేజ మార్కెట్ పడిపోయినట్లేనా ?

Raviteja career down fall మాస్ మహారాజ్ రవితేజ వరుసగా మూడు ప్లాప్ లను చవిచూసాడు . టచ్ చేసి చూడు , నేల టికెట్టు , అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో హ్యాట్రిక్ కొట్టాడు రవితేజ . దాంతో రవితేజ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది . ఈ మూడు చిత్రాలు కూడా ఘోర పరాజయం పొందడంతో మూడు కలిపి కనీసం 20 కోట్లు వసూల్ చేయలేకపోయాయి . కానీ రవితేజ మాత్రం ఒక్కో సినిమాకు పది కోట్ల చొప్పున రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అంటే కనీసం రెమ్యునరేషన్ స్థాయిలో కూడా వసూళ్లు రాలేదంటే ఎంత దారుణంగా రవితేజ మార్కెట్ ఉందో అర్ధం చేసుకోవచ్చు . అలాగే రవితేజ సినిమా కొనుక్కున్న వాళ్ళు ఎంత దారుణంగా నష్టపోయారో ఈ లెక్కలు చూస్తే తెలిసిపోతుంది .

రవితేజ కు గుడ్డిలో మెల్లగా వచ్చిన హిట్ అంటే ” రాజా ది గ్రేట్ ” మాత్రమే ! కానీ ఆ సినిమా తర్వాత మళ్ళీ ప్లాప్ ల వర్షంలో తడిసిపోతున్నాడు . తాజాగా చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ కేవలం ఆరు కోట్ల షేర్ మాత్రమే వచ్చింది . హిట్ కోసం తపనపడి చేసిన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు .

- Advertisement -

English Title: Raviteja career down fall

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All