Homeటాప్ స్టోరీస్నో అని చెప్ప‌లేక‌పోయాను: ర‌వీనాటాండ‌న్‌!

నో అని చెప్ప‌లేక‌పోయాను: ర‌వీనాటాండ‌న్‌!

నో అని చెప్ప‌లేక‌పోయాను: ర‌వీనాటాండ‌న్‌!
నో అని చెప్ప‌లేక‌పోయాను: ర‌వీనాటాండ‌న్‌!

ర‌వీనాటాండ‌న్ ద‌క్షిణాదిలో సినిమా చేసి దాదాపు 20 ఏళ్ల‌వుతోంది. సుధీర్ఘ వీర‌మం త‌రువాత ఆమె మ‌ళ్లీ ద‌క్షిణాదిలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`. య‌ష్ హీరోగా న‌టించిన సెన్సేష‌న‌త్ చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`కు కొన‌సాగింపుగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తొలి భాగం యావ‌త‌ట్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌డంతో రెండ‌వ పార్ట్‌పై అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి. 1951 నేప‌థ్యంలో సాగే ఓ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ క‌థ‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

చాప్ట‌ర్ 2లో తొలి భాగాన్ని మించిన ట్విస్ట్‌లు. ట‌ర్న్‌ల‌తో ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగేలా ద‌ర్శ‌కుడ ప్ర‌శాంత‌ట్ నీల్ ఈ చిత్రాన్ని డిజైన్ చేశారు. తొలి భాగంపై క్రేజ్ ఏర్ప‌డ‌టంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండ‌వ భాగాన్ని ఆల్ స‌ర్ ప్రైజ్ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దుతున్నారు. ఇందు కోసం బాలీవుడ్‌, టాలీవుడ్ న‌టుల్ని రంగంలోకి దింపారు. సినిమాలోని కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్ న‌టిస్తోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా శ‌క్తివంతంగా వుంటుంద‌ని ర‌వీనా ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

- Advertisement -

ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్‌కి ముందే త‌న‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ క‌లిసి క‌థ చెప్పార‌ని, న‌న్నెంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని, ప్ర‌శాంత్ న్యూ ఏజ్ సినిమాని న‌రేట్ చేసిన విధానం త‌న‌ని క‌ట్టిప‌డేసింద‌ని. పార్ట్ 2లో త‌న పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా సాగుతుంద‌ని , అందుకే నో చెప్ప‌లేక‌పోయాన‌ని ర‌వీనా ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించడం ఆస‌క్తిక‌రంగా మారింది. చాప్ట‌ర్ 2ని జూలై లేదా ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All