Homeటాప్ స్టోరీస్నాగ చైతన్య, పరశురామ్ సినిమాలో బ్లాక్ బస్టర్ హీరోయిన్

నాగ చైతన్య, పరశురామ్ సినిమాలో బ్లాక్ బస్టర్ హీరోయిన్

నాగ చైతన్య, పరశురామ్ సినిమాలో బ్లాక్ బస్టర్ హీరోయిన్
నాగ చైతన్య, పరశురామ్ సినిమాలో బ్లాక్ బస్టర్ హీరోయిన్

గతేడాది రెండు హిట్లతో మంచి ఊపు మీదున్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ స్టోరీ ఏప్రిల్ నెలలో విడుదల కానుందని ఇప్పటికే చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే నాగ చైతన్య తన తర్వాతి సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే.

పరశురామ్ దర్శకత్వంలో చైతన్య తన తర్వాతి చిత్రాన్ని చేయబోతున్నాడు. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత పరశురామ్ చైతూతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

- Advertisement -

మార్చ్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్లుగా కొద్ది రోజుల క్రితం ఒక వార్త షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే. 14 రీల్స్ బ్యానర్ పై నాగేశ్వరరావు అనే టైటిల్ రిజిస్టర్ కావడంతో అదే ఈ చిత్రానికేనని అందరూ అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను అనుకుంటున్నాడట పరశురామ్. వీరిద్దరూ గతంలో గీత గోవిందం సినిమాకి కలిసి పని చేసిన సంగతి తెల్సిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తోనే రష్మిక కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న ఈమె ఇప్పుడు భీష్మ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. మరో 10 రోజుల్లో భీష్మ విడుదలకు రెడీ అవుతోంది. అల్లు అర్జున్ సుకుమార్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా రష్మికనే ఎంపికైన విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ మరో నెల రోజుల్లో మొదలుకానుంది. ఇప్పుడు చైతూ సినిమాకు ఈ భామ ఎస్ చెబుతుందేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All