Homeగాసిప్స్నాని, నాగ చైతన్య మధ్య మరోసారి వార్ తప్పదా!

నాని, నాగ చైతన్య మధ్య మరోసారి వార్ తప్పదా!

నాని, నాగ చైతన్య మధ్య మరోసారి వార్ తప్పదా!
నాని, నాగ చైతన్య మధ్య మరోసారి వార్ తప్పదా!

ఇద్దరు హీరోల సినిమాలు, ఒకే నేపధ్యమున్నవి కొద్ది రోజుల వ్యవధిలోనే తెరకెక్కితే ఒక చిత్రం ఎఫెక్ట్ మరో చిత్రంపై కచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే పటాస్, టెంపర్ రెండిట్లోనూ హీరో కరెప్ట్ పోలీస్ ఆఫీసర్. ఈ రెండు చిత్రాలు కూడా కొద్దిరోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. కాకపొతే రెండిటికీ టేకింగ్ దగ్గరనుండి అన్నీ డిఫెరెంట్ గా ఉండడంతో రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వెంకీ మామ సినిమాలో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్న సంగతి తెల్సిందే. అలాగే సరిలేరు నీకెవ్వరులో మహేష్ కూడా ఆర్మీ ఆఫీసర్ గానే కనిపిస్తున్నాడు. ఇందులో మహేష్ మేజర్ గా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా రెండు వారాలు వ్యవధిలోనే విడుదలవుతాయి . కాకపోతే ఈ రెండు చిత్రాల్లో కూడా హీరో బ్యాక్ డ్రాప్ కోసమే ఆర్మీ నేపధ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అది మెయిన్ పాయింట్ కాదు.

మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళితే ఈ ఏడాది కొన్ని వారాల వ్యవధిలోనే నాని నటించిన జెర్సీ, నాగ చైతన్య నటించిన మజిలీ విడుదలయ్యాయి. ఈ రెండిట్లోనూ కామన్ పాయింట్. ఇందులో హీరోలు క్రికెటర్ కావాలని కలలు కంటారు. మంచి టాలెంట్ ఉన్నా కానీ వివిధ కారణాల వల్ల ఇద్దరూ కలను నెరవేర్చుకోలేకపోతారు. జెర్సీ ఫోకస్ అంతా క్రికెట్ మీదే ఉంటే మజిలీ విషయంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కు కనెక్ట్ చేసారు. పైగా జెర్సీలో సాడ్ ఎండింగ్ కూడా ఉంటుంది. ఈ కారణాల వల్ల జెర్సీ కన్నా మజిలీకే ఓటు వేశారు ప్రేక్షకులు. కంటెంట్ పరంగా ఏదీ తీసిపారేసే సినిమా కాదు, దేని వేల్యూ దానికి ఉంది. కానీ మజిలీతో పోల్చుకుంటే జెర్సీకి వచ్చిన కలెక్షన్లు చాలా తక్కువ. అప్పుడు నాని విజయావకాశాలను దెబ్బకొట్టిన చైతూ ఇప్పుడు మరోసారి నానితో పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే అదే జరిగేలా ఉంది.

- Advertisement -

ప్రస్తుతం నాని తన 25వ సినిమా V సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో నాని పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడట. ఈ చిత్రంలో సుధీర్ బాబు, నివేద థామస్, అదితి రావు హైదరి కూడా నటిస్తున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా విడుదల చేస్తున్నట్లు V టీమ్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు నాగ చైతన్య కూడా నానికి పోటీగా వస్తున్నాడట. వెంకీ మామ డిసెంబర్ 13న విడుదలవుతోంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను కూడా మార్చ్ చివర్లో కానీ ఏప్రిల్ మొదట్లో కానీ విడుదల చేయాలని చూస్తున్నారు. నిజానికి ఇంకా ముందే విడుదల చేయాలని అనుకున్నా వెంకీ మామకు ఈ చిత్రానికి కనీసం రెండు నెలలు గ్యాప్ ఉండాలని అలా డిసైడ్ చేసారు. మరి ఈసారి నాని, నాగ చైతన్య పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All