Homeగాసిప్స్నాగార్జున & నాని మళ్లీ ఆ తప్పు చేయబోతున్నారా.?

నాగార్జున & నాని మళ్లీ ఆ తప్పు చేయబోతున్నారా.?

Will Nag  Nani doing the same mistake
Will Nag Nani doing the same mistake

సినిమా అనేది ఒక సమిష్టి కృషి మీదే ఆధారపడి నడిచే ఒక పెద్ద ప్రాసెస్. ఒక సినిమా తయారవ్వాలంటే 24 విభాగాలకు సంబంధించిన అందరూ కలిసి పని చేయాలి. కానీ కొంత కాలంగా ఒక సినిమా హిట్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా , ఆర్టిస్టులు టెక్నీషియన్ల యొక్క కంట్రిబ్యూషన్ గురించి మాట్లడుకోకపోయినా, అందరూ ముఖ్యంగా ముగ్గురు గురించే మాట్లాడుతూ ఉంటారు. అందులో ఒకరు హీరో, డైరెక్టర్, నిర్మాత. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బేస్ అయ్యి ఒక ప్రాజెక్టు పనులు అవ్వడం జరుగుతుంది.

పెద్ద హీరోలు కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీలో మామూలే, కాకపోతే చాలా మంది రిస్క్ చేయరు. కానీ కొంతమంది పెద్ద హీరోలు కథ మీద డైరెక్టర్ మీద నమ్మకం ఉంటే అతను సినిమా చేయగలడా అన్న విషయాన్ని పక్కన పెడితే, అతనికి ఒక సపోర్ట్ గా నిలబడి ఆ సినిమాని చేయిస్తూ ఉంటారు.

- Advertisement -

అలాంటి వాళ్లలో ఒకరే టాలీవుడ్ కింగ్ నాగార్జున. అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు శివ సినిమాని, ఎవరు నమ్మినా నమ్మక పోయినా, రాంగోపాల్ వర్మ నమ్మినట్లు అనుకున్నట్లు సినిమా అవుట్ పుట్ రావడానికి ప్రధాన కారణం నాగార్జున ఇచ్చిన సపోర్ట్ అని కొన్ని వందల వేదికలమీద ఆర్జివి ఇప్పటికే చెప్పాడు.

ఆ తర్వాత కూడా కింగ్ నాగార్జున చాలా మంది యువ దర్శకులను కొత్త దర్శకులను ఇండస్ట్రీకి తీసుకువచ్చాడు. వాళ్లలో చాలామంది సక్సెస్ కాలేదు. అయినా నాగార్జున తన స్టైల్ మార్చలేదు. కేడి అనే సినిమాతో కిరణ్ అనే డైరెక్టర్ ని, మాస్ సినిమాతో డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కి, అదేవిధంగా దేవదాసు అనే సినిమాతో శ్రీరామ్ ఆదిత్యకు ఇటీవల మన్మధుడు 2 సినిమా కి రాహుల్ రవీంద్రన్ కి అవకాశం ఇచ్చాడు. కొన్నిసార్లు ఈ ప్రయోగాలు వికటించి సినిమాలు ఆడకపోయినా, నాగార్జున తన వచ్చే సినిమాలో కూడా సాల్మన్ అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నాడు.

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి అనే సినిమా కి రైటర్ గా పని చేశాడు సాల్మన్. తను చెప్పిన కథ నచ్చి నాగార్జున అతనికి అవకాశం కాబోతునట్లు సమాచారం. అయితే దాని కంటే ముందు ఒక రీమేక్ సినిమాని డైరెక్ట్ చేయవలసిందిగా నాగార్జున అతనికి సూచించగా తర్వాత ఆ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. సాల్మన్ చెప్పిన కథని నాగార్జున ఒప్పుకుని సాల్మన్ కి డైరెక్షన్ అప్పగించనున్నట్లు తెలుస్తుంది.

ఇదేవిధంగా టాలీవుడ్ హీరో నాని కూడా కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులతో కొత్త కథలతో కొత్త సినిమాలు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు హీరో నాని.

ప్రస్తుతం నాని కూడా విజయ్ అనే ఒక కొత్త దర్శకుడి చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. మొదట శివ నిర్వాణ చెప్పిన కథని O.K చేసిన నేచురల్ స్టార్, ఆ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ ఉండటంతో ఈ లోపు విజయ్ అనే కొత్త దర్శకుడితో సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు.

మరి కాకతాళీయంగానో, యాదృచ్ఛికంగానో దేవదాసు అనే సినిమా ద్వారా గురుశిష్యులు గా పేరు తెచ్చుకున్న నాగార్జున & నాని కొత్త దర్శకులకు ఇలా ఛాన్సులు ఇవ్వడం ద్వారా హిట్ లు సాధిస్తారా..? లేకపోతే ఫ్లాపులు చూస్తారో లేదో తెలుసుకోవాలంటే ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All