Homeగాసిప్స్పరశురామ్.. మనిషన్నాక పట్టూ విడుపూ ఉండాలయ్యా!

పరశురామ్.. మనిషన్నాక పట్టూ విడుపూ ఉండాలయ్యా!

పరశురామ్.. మనిషన్నాక పట్టూ విడుపూ ఉండాలయ్యా!
పరశురామ్.. మనిషన్నాక పట్టూ విడుపూ ఉండాలయ్యా!

ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఒక సన్నివేశం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సినిమా తీయాలన్న కసితో గద్దలకొండ గణేష్ గురించి ఎంక్వయిరీ చేసి తన కథనే సినిమా తీయాలనుకుంటాడు దర్శకుడు కావాలని తపించిపోయే అభిలాష్. అయితే దీని గురించి తెలుసుకున్న గణేష్ తననే హీరోగా పెట్టి సినిమా తీయమని చెప్తాడు. దీంతో అభిలాష్ పూర్తిగా డల్ అయిపోతాడు. అసలు ఈ కథను తీయకూడదు అని నిరుత్సాహంతో ఉంటాడు. అప్పుడే తనికెళ్ళ భరణి పాత్ర వచ్చి సినిమా అన్నాక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నువ్వు దర్శకుడివి, నువ్వే హీరోలను చేస్తావు. ఎవరితోనైనా సినిమా తీయగలవు.. కొంచెం అడ్జస్ట్ అవ్వు అంటాడు.

జీవితంలో కంప్రమైజ్ అవ్వకూడదని, సినిమాల్లో తాను అస్సలు కంప్రమైజ్ అవ్వలేనని చెబుతాడు అభిలాష్. తాను కంప్రమైజ్ అవ్వమని చెప్పట్లేదని, కేవలం అడ్జస్ట్ అవ్వమని మాత్రమే అంటున్నానని అంటాడు. రెండిటికీ తేడా ఏంటని అడిగితే సినిమాలు వదిలేసి వేరే పని చూసుకోమని అంటే అది కంప్రమైజ్, అదే సినిమాల్లోనే కొంచెం తగ్గమంటే అది అడ్జస్ట్మెంట్. మనిషి కంప్రమైజ్ అవ్వాల్సిన పనిలేదు కానీ అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తాడు. ఇప్పుడు ఇదే కథ హిట్ దర్శకుడు పరశురామ్ కు చెప్పాలనిపిస్తోంది.

- Advertisement -

ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్ లో గీత గోవిందం లాంటి ఒక సూపర్ ఎంటర్టైనర్ ఇచ్చి 100 కోట్ల క్లబ్ లో సినిమాను చేర్చాడు. ఈ మధ్య కాలంలో అత్యంత లాభాలు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ గా గీత గోవిందం గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఇందులో హీరోగా చేసిన విజయ్ దేవరకొండవి గీత గోవిందం తర్వాత మూడు సినిమాలు విడుదలయ్యాయి. నాలుగో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అయినా పరశురామ్ కొత్త సినిమా ఏంటన్న క్లారిటీ మాత్రం ఇంతవరకూ రాలేదు. ఈ గ్యాప్ కు ప్రధాన కారణం పరశురామ్ స్టార్ హీరోతోనే సినిమా చేయాలన్న కోరిక అని తెలుస్తోంది.

గీత గోవిందం తర్వాత పరశురామ్ మహేష్ బాబుకు టచ్ లోకి వెళ్ళాడు. ఒక ఆరు నెలలు ట్రావెల్ అయ్యాక మహేష్ నో అని చెప్పేసాడు. ఇదే పరిస్థితి బన్నీతో జరిగింది. అల వైకుంఠపురములో కంటే ముందు పరశురామ్ సినిమా మొదలవుతుంది అనుకున్నారు కానీ బన్నీ త్రివిక్రమ్ కే ఓటు వేసాడు. ఈ నేపథ్యంలో ఎవరైనా కొంచెం తగ్గి మిడ్ రేంజ్ హీరోల వైపు వెళ్తాడు కానీ పరశురామ్ మాత్రం అసలు తగ్గనంటున్నాడు. పట్టు విడవనంటున్నాడు. చేస్తే స్టార్ హీరోతోనే సినిమా చేస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు. పరశురామ్ కు గీతా ఆర్ట్స్ సంస్థ డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఏ హీరోను తెచ్చుకున్నా ఈపాటికి సినిమా విడుదలై మూడు నెలలకు పైగా అయ్యేది. కానీ పరశురామ్ తన మొండి పట్టుదలతో స్టార్ హీరో కోసమే చూస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. వరసగా సినిమాలు కమిట్ అవుతూ ఫుల్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు. మరి పరశురామ్ ఎంత కాలమని ఇలా వెయిట్ చేస్తాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All