Homeగాసిప్స్మెగా ఐటమ్ ఆఫర్ పట్టేసిన రష్మీ గౌతమ్

మెగా ఐటమ్ ఆఫర్ పట్టేసిన రష్మీ గౌతమ్

మెగా ఐటమ్ ఆఫర్ పట్టేసిన రష్మీ గౌతమ్
మెగా ఐటమ్ ఆఫర్ పట్టేసిన రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా రష్మీ ఫేమస్. జబర్దస్త్ యాంకర్ గా తన పాపులారిటీ పెంచుకున్న రష్మీ సినిమాలు కూడా బాగానే చేసింది. అయితే ఆమె హీరోయిన్ గా చేసిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం బుల్లితెరపైనే తన ఫోకస్ ను ఎక్కువగా పెట్టింది.

ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్ ఒక ఐటెం సాంగ్ చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. రష్మీ ఇప్పటికే గతంలో ఒక ఐటెం సాంగ్ చేయగా ఈసారి ‘మెగా’ ఆఫర్ నే పట్టేసిందిట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ లో రష్మీ గౌతమ్ ఐటెం సాంగ్ చేయబోతోందని వినికిడి. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది. ఇక కీలకమైన చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు గతంలోనే ప్రకటించారు.

- Advertisement -

ఇటీవలే భోళా శంకర్ షూటింగ్ ను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. రష్మీ గౌతమ్ ఐటెం సాంగ్ గురించి అధికారిక ప్రకటన త్వరలో ఇస్తారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో భోళా శంకర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: 

రష్మీ కారు యాక్సిడెంట్

లిప్ లాక్ లిస్తా , క్లీవేజ్ షో చేస్తానంటున్న భామ

అంతకు మించి టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల కార్యక్రమం

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All