Homeటాప్ స్టోరీస్అలా నేను చెప్ప‌లేదు - రాశీఖ‌న్నా

అలా నేను చెప్ప‌లేదు – రాశీఖ‌న్నా

అలా నేను చెప్ప‌లేదు - రాశీఖ‌న్నా
అలా నేను చెప్ప‌లేదు – రాశీఖ‌న్నా

రాశీఖ‌న్నా న‌టించిన చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని క్రాంతి మాధ‌వ్ తెర‌కెక్కించారు. కె.ఎస్‌. రామారావు నిర్మించిన ఈ చిత్రంలో రాశీఖ‌న్నాతో పాటు కేథ‌రిన్‌, ఐఠ‌శ్వ‌ర్యా రాజేష్‌, ఇజ‌బెల్ల క‌థానాయిక‌లుగా న‌టించారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 14న భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం  బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ అయింది.

చిత్ర నిర్మాత‌కు భారీ న‌ష్టాల‌ని తెచ్చిపెట్టింది. ఒక్క‌సారిగా ఈ చిత్రం వార్త‌ల్లో నిలిచింది. అయితే ఈ చిత్రంపై రాశీఖ‌న్నా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింద‌ని, గ‌త చిత్రాల‌కు మించి ఈ సినిమాలో హ‌ద్దులు దాటి లిప్ లాక్‌లు, బెడ్ రూమ్ సీన్‌లు చేయాల్సి వ‌చ్చింద‌ని, అయితే అవి అయిష్టంగానే తాను చేశాన‌ని, భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ అలాంటి స‌న్నివేశాల్లో న‌టించ‌న‌ని రాశీఖన్నా వెళ్ల‌డించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

- Advertisement -

అయితే అలా తాను చెప్ప‌లేద‌ని రాశీఖ‌న్నా ట్విట్టర్ వేదిక‌గా స్పందించారు. తాను బాధ‌ప‌డుతూ ఏ సినిమా చేయ‌లేద‌ని, విజ‌యం సాధించినా సాధించ‌క‌పోయినా ప్ర‌తి సినిమా అంద‌మైన ప్ర‌యాణం. ప్ర‌తి చిత్రం కొత్త విష‌యాల్ని నేర్పుతుంది. మేమంతా న‌టులుగా ఇంకాస్త ఎదుగుతాం. అంతే కానీ ఏ సినిమాని భ‌యంతోనే బాధ‌తోనో చేయం అని వెల్ల‌డించింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All