Wednesday, October 5, 2022
Homeటాప్ స్టోరీస్థియేట‌ర్లో టిక్కెట్లు అమ్మిన హీరోయిన్‌!

థియేట‌ర్లో టిక్కెట్లు అమ్మిన హీరోయిన్‌!

థియేట‌ర్లో టిక్కెట్లు అమ్మిన హీరోయిన్‌!
థియేట‌ర్లో టిక్కెట్లు అమ్మిన హీరోయిన్‌!

సినిమాలో కంటెంట్ స్ట్రాంగ్ వున్నా స‌రైన ప్ర‌చారం లేక‌పోతే ఆ సినిమా కోసం థియేట‌ర్‌కు ప్రేక్ష‌కులు రావ‌డం లేదు. ఈ మ‌ధ్య‌ డిజిట‌ల్ మాధ్య‌మాల హంగామా పెరిగిపోవ‌డంతో సినిమా వైపు చూసే వాళ్ల ప‌ర్సెంటేజ్ త‌గ్గిపోతోంది. దీంతో సినిమా ప్ర‌చారం కోసం ఎక్క‌డి వ‌ర‌కైనా వెళుతున్నారు మ‌న స్టార్స్‌. స‌గ‌టు ప్రేక్ష‌కుడిని థియేట‌ర్‌కు ర‌ప్పించ‌డం కోసం ఏకంగా ప్రేక్ష‌కుడి ద‌గ్గ‌రికే వెళుతున్నారు. వాళ్ల‌తో చేరి నానా హంగామా చేస్తున్నారు.

- Advertisement -

బెల్లం శ్రీ‌దేవిగా ఆక‌ట్టుకున్న రాశిఖ‌న్నా తన తాజా చిత్రం కోసం గోకుల్ థియేట‌ర్‌లో హంగామా చేసింది. ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `ప్ర‌తిరోజు పండ‌గే`. సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని మారుతి తెర‌కెక్కించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా హైద‌రాబాద్‌లోని గోకుల్ థియేట‌ర్‌కు వెళ్లిన రాశిఖన్నా టిక్కెట్ కౌంట‌ర్‌లో కూర్చుని త‌న సినిమా టిక్కెట్‌ల‌ని అమ్మ‌డంతో అభిమానులంతా ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో క‌లిసి రాశీఖ‌న్నా ఇంత‌కు ముందు `సుప్రీమ్‌` చిత్రంలో న‌టించింది. అందులో రాశి బెల్లం శ్రీ‌దేవిగా న‌టించి న‌వ్వులు కురిపించిన విష‌యం తెలిసిందే. తాజా చిత్రంలో రాశి టిక్‌టాక్ చేసే ఏంజిల్ గా మరోసారి ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ చిత్రంలో స‌త్య‌రాజ్‌, విజ‌య్‌కుమార్‌, రావు ర‌మేష్‌, న‌రేష్‌, ప్ర‌భ‌, ముర‌ళీఠ‌శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts