
కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గతంతో పోలిస్తే ఈ దఫా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో చాలా వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తే తప్ప సెకండ్ వేవ్‌ని తట్టుకోవడం కష్టమని భావిస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
థియేటర్లకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం లేకపోవడంతో పలు సినిమా రిలీజ్లు వాయిదా పడుతున్నాయి. ఇప్పటిఏ కంగన నరౌత్ నటించిన `తలైవి`, నాగచైతన్య నటించిన `లవ్‌స్టోరీ`తో పాటు పలు హిందీ చిత్రాలు, రానా నటించిన `అరణ్య` మిందీ వెర్షన్ రిలీజ్ వాయిదా పడ్డాయి. ఇదే తరహాలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన `విరాట పర్వం` రిలీజ్ కూడా వాయిదా పడింది.
ఈ విషయాన్ని మేకర్స్ బుధవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేసులు పెరుగుతున్న కారణంగా మా చిత్ర రిలీజ్‌ని వాయిదా వేస్తున్నాం. తదుపరి రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం` అని మేకర్స్ ప్రకటించాస్పష్టం చేశారు. ముందు ఈ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.