
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం `వకీల్‌సాబ్`. ఈ మూవీ చిత్రీకరణ తిరిగి ఇటీవలే ప్రారంభమైంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కతున్న ఈ మూవీ షూటింగ్ ఫినిష్ కాగానే వవన్ మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో నటించబోతున్న విషయం తెలిసిందే.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రానా కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడంటూ వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రానా ఇంత వరకు స్పందించలేదు. తాజాగా ఈ వార్తలపై స్పందించారు.
`నిజమే సవన్ సినిమాలో ఓ పాత్ర కోసం చిత్ర బృందం నన్ను సంప్రదించింది. అయితే అది ఇంకా ఫైనల్ కాలేదు. నిజం చెప్పాలంటే ఆ పాత్ర చేయడం నాక్కూడా ఎంతో ఇష్టం` అని రానా వెల్లడించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం వుందని తెలిసింది. బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి రానా ఓ చిత్రాన్ని చేయబోతున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.