Homeటాప్ స్టోరీస్`వ‌కీల్‌సాబ్‌` నుంచి స‌ర్‌ప్రైజ్ అప్పుడే!

`వ‌కీల్‌సాబ్‌` నుంచి స‌ర్‌ప్రైజ్ అప్పుడే!

`వ‌కీల్‌సాబ్‌` నుంచి స‌ర్‌ప్రైజ్ అప్పుడే!
`వ‌కీల్‌సాబ్‌` నుంచి స‌ర్‌ప్రైజ్ అప్పుడే!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌త ఏడు నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. చాలా రోజుల త‌రువాత ప‌వ‌ర్ స్టార్ సెట్‌లో అడుగుపెట్టారు. ఈ నెలాఖ‌రు వ‌రు షూటింగ్‌ని పూర్తి చేయ‌బోతున్నారు.

అన్నీ అనుకున్న‌ట్టుగా కుదిరితే ఈ మూవీని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం ముందుగా టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా ఈ మూవీ నుంచి టీజ‌ర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపుల‌కు త్వ‌ర‌లో తెర‌ప‌డ‌బోతోంది.

- Advertisement -

దీపావ‌ళికి టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని అప్పుడే ఏర్పాట్లు మొద‌లుపెట్టారు. త‌మ‌న్ ఇందు కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నారు. తాజాగా త‌మ‌న్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసి మ్యూజిక్ సిట్టింగ్ ఫొటోలు `వ‌కీల్‌సాబ్‌` నేప‌థ్య సంగీతం కోసం త‌మ‌న్ ఏ స్థాయిలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారో తెలుస్తోంది. ఇందులో క‌థానుసారం పెద్ద‌గా పాట‌లు వుండ‌వంటి అందుకే నేప‌థ్య సంగీతంతో అద‌ర‌గొట్టాల‌ని త‌మ‌న్ ఏర్పాట్లు చేస్తున్నాడు. దీపావ‌ళికి రానున్న టీజ‌ర్‌లో త‌మ‌న్ నేప‌థ్య సంగీతం హైలైట్ కానుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All