
దాదాపు ఏడు నెలల విరామం తరువాత బిగ్ ప్రొడక్షన్ కంపెనీలన్నీ తమ సినిమాల షూటింగ్స్‌ని తిరిగి ప్రారంభిస్తున్నాయి. ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చిన దగ్గరి నుంచి చిన్న చిత్రాల షూటింగ్స్ మొదలయ్యాయి. ఇటీవలే నాగార్జున చొరవ తీసుకుని ముందుకు రావడంతో బిగ్‌బాస్ సీజన్ 4 కోసం ప్రోమోతో పాటు షూటింగ్‌లో కూడా పాల్గొనడంతో చాలా మంది స్టార్స్ షూటింగ్స్ చేయడానికి ముందుకొస్తున్నారు.
నాగార్జున `వైల్డ్ డాగ్` షూటింగ్‌లోనూ పాల్గొనడంతో నాగచైతన్య కూడా `లవ్‌స్టోరీ`ని మొదలుపెట్టేశాడు. దీంతో స్టార్ హీరోలు కూడా సెట్‌లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల మహేష్ బాబు కూడా కమర్షయల్ యాడ్ కోసం సెట్‌లో సందడి చేయడంతో పవర్‌స్టార్ కూడా సై అంటూ సిగ్నల్ ఇచ్చేశారట. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం `వకీల్‌సాబ్`.
శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్‌ని కరోనా కారణంగా నిలిపివేశారు. దాదాపు 7 నెలల విరామం తరువాత మళ్లీ ఈ నెల 23 నుంచి తికిగి ప్రారంభిస్తున్నారని తెలిసింది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.