Homeఎక్స్ క్లూసివ్రానా పెళ్లి వార్త చెప్పేశాడు!

రానా పెళ్లి వార్త చెప్పేశాడు!

రానా పెళ్లి వార్త చెప్పేశాడు!
రానా పెళ్లి వార్త చెప్పేశాడు!

టాలీవుడ్‌లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రానా. `బాహుబ‌లి` చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. గ‌త కొంత కాలంగా పెళ్లి వార్త‌ల‌పై స్పందించ‌ని రానా తాజాగా స్పందించారు. సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా త‌ను పెళ్లి చేసుకోబోయే జీవిత భాగ‌స్వామిని ప‌రిచ‌యం చేసి షాకిచ్చారు.

టాలీవుడ్‌లో ఇప్ప‌టికే ఇద్ద‌రు యంగ్ హీరోలు నితిన్‌, నిఖిల్ ఎంగేజ్‌మెంట్ కార్య‌క్ర‌మాల‌ని పూర్తి చేసుకుని పెళ్లికి సిద్ధంగా వున్నారు. క‌రోనా కార‌ణంగా ఏప్రిల్ 15, 16 తేదీల్లో ప్లాన్ చేసుకున్న వీరి వివాహాన్ని వాయిదా వేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా రానా వీరి త‌ర‌హాలోనే పెళ్లికి సిద్ధ‌మ‌వుతుండ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -

గ‌త కొంత కాలంగా త‌న పెళ్లిని వాయిదా వేస్తూ వ‌స్తున్న రానా తాజాగా మంగ‌ళ‌వారం త‌ను ప్రేమిస్తున్న గాళ్ ఫ్రెండ్ ఎవ‌రో చెప్పేశారు. రానా వివాహం చేసుకోబోతున్న ఆ యువ‌తి మ‌రెవ‌రో కాదు మిహీకా బ‌జాజ్‌. త‌న‌కి ప్ర‌పోజ్ చేశాన‌ని, త‌ను ఓకే చెప్పింద‌ని ఇన్ స్టా వేద‌క‌గా ఓ ఫొటోని షేర్ చేస్తూ ఆ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చారు రానా. ఈ పోస్ట్‌కి హీరోయిన్‌లు  కంగ్రాట్సులేష‌న్స్‌ని శృతిహాస‌న్, హ‌న్సిక అంటే స‌మంత మాత్రం చ‌చ్చాడంటూ కామెంట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. లాక్‌డౌన్ త‌రువాత రానా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొద‌లుపెట్ట‌నున్నార‌ట‌. మిహీకా బ‌జాజ్ ముంబైలో పుట్టినా పెరిగింది మాత్రం హైద‌రాబాద్‌లోనే అని తెలిసింది.

 

View this post on Instagram

 

And she said Yes 🙂 ❤️#MiheekaBajaj

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All