
`మహానటి` చిత్రంతో కీర్తిసురేష్ టాలెంట్ ఏంటో యావత్ సినీ ప్రపంచానికి తెలిసిపోయింది. ఆమె అద్భుతాభినయానికి ముగ్ధులైన వారంతా ఒక్కసారి ఆమెతో కలిసి నటించాలని చూస్తున్నారు. అయితే ఆ ఛాన్స్ రెండు సార్లు నితిన్‌కే దక్కినట్టు తెలుస్తోంది. `భీష్మ` సూపర్ హిట్ తరువాత నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం `రంగ్‌దే`. వెంకీ అట్టూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నితిన్‌తో కలిసి మరో చిత్రంలో కీర్తిసురేష్ నటించనున్నట్టు తెలిసింది. నితిన్ హీరోగా ప్రస్తుతం నాలుగు చిత్రాలు అండర్ ప్రొడక్షన్‌లో వున్నారు. అందులో ఒకటి `రంగ్‌దే` కాగా మరో మూడు చిత్రాల్లో 29వ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి, 30వ చిత్రానికి కృష్ణ చైతన్య, 31వ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా వుంటే నితిన్ 30వ చిత్రంగా కృష్ణచైతన్య `పవర్ పేట` పేరుతో ఓ మాసీవ్ చిత్రాన్ని తెరపైకి తీసుకురనాబోతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని ఫైనల్ చేసినట్టు తెలిసింది.