Homeటాప్ స్టోరీస్130 సెక‌న్ల‌లో `బాహుబ‌లి 2` అదిరింది!

130 సెక‌న్ల‌లో `బాహుబ‌లి 2` అదిరింది!

130 సెక‌న్ల‌లో `బాహుబ‌లి 2` అదిరింది!
130 సెక‌న్ల‌లో `బాహుబ‌లి 2` అదిరింది!

`బాహుబ‌లి`.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు చాటిన చిత్ర‌మిది. ఈ సినిమా  త‌రువాతే తెలుగు సినిమా వైపు యావ‌త్ ప్ర‌పంచం ఆస‌క్తిగా ఎదురుచూడ‌టం మొద‌లుపెట్టింది. ఈ సినిమా త‌రువాతే ఇక్క‌డి చిత్రాల మార్కెట్ స్థాయి పెరిగింది.. విస్త‌రించింది. భారీ బ‌డ్జెట్ సినిమా అంటే భ‌య‌ప‌డే నిర్మాత‌లు ఈ సినిమా త‌రువాత సై అంటూ ముందుకొచ్చేలా చేసింది.  2017 ఏప్రిల్ 28న విడుద‌లైన `బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌` చిత్రం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది.

ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌, ప్ర‌భాస్‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌, అనుష్క‌, త‌మ‌న్నా, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌ల న‌ట‌న ఈ చిత్రాన్ని ఉన్న‌త శిఖ‌రానికి చేర్చాయి. ఈ సినిమా విడుద‌లై నేటికి మూడేళ్లు పూర్తి కావ‌డంతో ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్స్ ఈ చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. చిత్ర బృందం షూటింగ్ సంద‌ర్భంగా తీసిన ఆన్ లొకేష‌న్ ఫొటోల‌ని షేర్ చేసింది.

- Advertisement -

`ఏప్రిల్ 28 భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన రోజు. చ‌రిత్ర సృష్టించింది. బాక్సాఫీస్‌ని బ‌ద్ద‌లు కొట్టింది.  గ‌తంలో ఏ చిత్ర‌మూ సాదించ‌ని విధంగా వెయ్యి కోట్లు వ‌సూళ్లు సాధించింది. జై మ‌హిష్మ‌తి` అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. ఈ సినిమా  మొత్తం ర‌న్‌ని 10 ఎక్స్ స్పీడ్‌లోకి మార్చి ఓ వ్య‌క్తి 130 సెక‌న్ల‌లో క‌ట్ చేసిన వీడియో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All