Homeటాప్ స్టోరీస్సామజవరగమనకు గట్టి పోటీ ఇస్తోన్న పాట

సామజవరగమనకు గట్టి పోటీ ఇస్తోన్న పాట

Ramulo Ramula catching up with Samajavaragamana in Ala Vaikunthapuramulo
Ramulo Ramula catching up with Samajavaragamana in Ala Vaikunthapuramulo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం మ్యూజికల్ గా పెద్ద హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో పాటలు అన్నీ మంచి హిట్స్ గా నిలిచాయి. లేటెస్ట్ గా వచ్చిన బుట్ట బొమ్మ సైతం అందరినీ ఆకర్షించింది. ఇక మొదట విడుదలైన సామజవరగమన, రాములో రాముల సాంగ్స్ ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు పాటలు వందల మిలియన్ వ్యూస్ లో తెలుగు పాటల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. సామజవరగమన అండ్ రాములో రాముల దేనికదే ప్రత్యేకమైన పాట కావడం విశేషం. ఒకటి ఫుల్ క్లాస్ సాంగ్ కాగా మరొకటి పక్కా మాస్ సాంగ్. ఒకటి అన్ని వర్గాల వారిని అలరిస్తుంటే మరొకటి యూత్ కు పిచ్చెక్కిస్తోంది.

ఈ రెండు పాటల్లో సామజవరగమన కంటే రాములో రాముల నెల రోజులు వెనుక విడుదలైంది. అయినా కానీ వ్యూస్ పరంగా సెకండ్ సాంగ్ మొదటి పాట కంటే కేవలం 5 మిలియన్ వ్యూస్ వెనుక ఉంది. ఇప్పుడు సామజవరగమన సాంగ్ కు 127 మిలియన్ వ్యూస్ ఉంటే రాములో రాముల సాంగ్ కు 122 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సినిమా విడుదలయ్యే లోగా రాములో రాముల, సామజవరగమన సాంగ్ ను బీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

ఈ రెండు పాటలు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి సాంగ్ ట్యూన్స్, లిరిక్స్, సింగర్స్ ఒక కారణమైతే, వీటిని మ్యూజికల్ వీడియోస్ గా షూట్ చేయడం మరో కారణం. ఇక రాములో రాముల సాంగ్ కైతే హాఫ్ కోట్ స్టెప్ లాంటివి యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఏదేమైనా సూపర్ హిట్ అయిన సాంగ్స్ కు వీడియో వెర్షన్ విడుదలైతే ఇలాంటి వ్యూస్ ను ఊహించవచ్చు కానీ కేవలం ఆడియో సాంగ్స్ తోనే ఇన్ని రికార్డులను కొల్లగొట్టిన ఈ రెండు సాంగ్స్ ను బీట్ చేయడం చాలా కష్టం. బహుశా థమన్, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి చేసినా ఈ ఫీట్ ను మళ్ళీ పునరావృతం చేయలేరేమో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All