Homeటాప్ స్టోరీస్వెన్నుపోటు అంశం ఉంటుందట

వెన్నుపోటు అంశం ఉంటుందట

Ramgopal varma target chandrababu and balakrishnaమొత్తానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టాలని , బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ని దెబ్బ కొట్టాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్లున్నాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని రూపొందిస్తున్నాడు . నిన్న తిరుపతిలో ప్రారంభమైన లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలుగుదేశం వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది ఇక దానికి తోడూ ఈ రోజు చెప్పిన విషయంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని , చంద్రబాబు ని టార్గెట్ చేసాడు వర్మ అని డిసైడ్ అయ్యింది . ఎందుకంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు వెన్నుపోటు అంశం ఉంటుందని , ఖచ్చితంగా ఎన్టీఆర్ ని బాబు వెన్నుపోటు పొడిచాడని అప్పటి పాత్రలు అన్నీ యధాతదంగా ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ .

పైగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24 న విడుదల చేస్తామని ప్రకటించాడు కూడా . అంటే సరిగ్గా ఎన్నికల ముందు అన్నమాట ! ఆంధ్రపదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లో రానున్నాయి . జనవరి చివరి వారం అంటే ఎన్నికల వేడి బాగా రాజుకుంటుంది ఆ సమయంలో ఇక దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆజ్యం పోసినట్లే ! అలాగే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని కూడా టార్గెట్ చేస్తున్నాడు వర్మ . ఎన్టీఆర్ కథతో ఎన్ని చిత్రాలు వచ్చినా ఎన్టీఆర్ ఆశీస్సులు మాకు మాత్రమే ఉంటాయని చెప్పాడంటే ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అని చెప్పినట్లే కదా !

- Advertisement -

English Title: Ramgopal varma target chandrababu and balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All