Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్ని వివాదాలు సృస్టించనుందో

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్ని వివాదాలు సృస్టించనుందో

Controversy biopic lakshmi's ntr gets muhurthamఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ తెరకేక్కుతుండగా మరోవైపు ఆ చిత్రానికి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈరోజు ప్రారంభం కానుంది . అయితే బాలకృష్ణ రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో కొన్ని అంశాలు మాత్రమే ఉండగా పలు వివాదాస్పద అంశాలు మాత్రం అస్సలు టచ్ చేయడం లేదు ముఖ్యంగా లక్ష్మీపార్వతి ని రెండో పెళ్ళి చేసుకోవడం , ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పీఠం నుండి దించడం వంటి అంశాలు అస్సలు ఎన్టీఆర్ బయోపిక్ లో లేవు కానీ ఆ వివాదాస్పద అంశాలు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చర్చ కు పెట్టనున్నాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . అంతేకాదు మరుగున పడిన ఎన్టీఆర్ జీవితంలోని అసలైన అంశాలు ,అసలైన నిజాలు చూపిస్తానని అంటున్నాడు వర్మ .

అసలు దేవుణ్ణి నమ్మని వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం . ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రారంభం అవుతుందని అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయని , వాటిని యధాతదంగా చూపించే శక్తిని ఇవ్వు అంటూ శ్రీవారిని వేడుకున్నాడు వర్మ . ఈ వివాదాస్పద దర్శకుడి వెంట లక్ష్మీపార్వతి ఉండటం విశేషం . అంటే ఖచ్చితంగా వివాదస్పద అంశాలు టచ్ చేయడం ఖాయం , చంద్రబాబు ని విలన్ గా చూపించడం ఖాయమని అంటున్నారు . ఇక ఈ సినిమా విడుదల అయితే ఎన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి .

- Advertisement -

English Title: Controversy biopic lakshmi’s ntr gets muhurtham

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All