Homeటాప్ స్టోరీస్బాహుబలి రికార్డు ని బ్రేక్ చేసిన కరోనా వైరస్

బాహుబలి రికార్డు ని బ్రేక్ చేసిన కరోనా వైరస్

బాహుబలి రికార్డు ని బ్రేక్ చేసిన కరోనా వైరస్
బాహుబలి రికార్డు ని బ్రేక్ చేసిన కరోనా వైరస్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేలాది మందిని పొట్టన పెట్టుకుంది.లక్షలాది మంది ప్రజల జీవనాధారాన్ని ఉపాధిని వ్యాపారాన్ని అవకాశాలను దెబ్బతీసింది.అదేవిధంగా కోట్లమంది ప్రజలను భయంతో ఇల్లు వదిలి బయటకు రానీయకుండా చేస్తోంది. కారణాలు ఏమిటో తెలియదు.. గానీ, మన భారతదేశంలో కరోనా వైరస్ వల్ల ప్రస్తుతానికి తక్కువగా నష్టం జరుగుతున్నా.. దాన్ని మనవాళ్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే మరొక పక్క నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, డాక్టర్లు అందరూ ఈ నెలాఖరు వరకు ప్రజలు బయట గుంపులుగుంపులుగా తిరగకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా కూడా… ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది.

ఇక మరొకవైపు అగ్రరాజ్యమైన అమెరికా లో కూడా కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఒక వీడియో ద్వారా అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనకు అర్థమవుతుంది.

- Advertisement -

నిత్యావసర వస్తువులు మరియు సరుకుల కోసం షాపింగ్ మాల్స్ వద్ద కనీసం రెండు కిలోమీటర్ల వరకు అక్కడ క్యూ ఉంది. మనదేశంలో లాగా కాకుండా అక్కడ నిజంగా బంద్ అని ప్రకటిస్తే బంద్ పాటిస్తారు. కానీ సామాన్య ప్రజలు నిత్యావసర సరుకుల కోసం మరియు ఇతర వస్తువులు మందుల కోసం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు అంత మంది ప్రజలు గుంపులు గుంపులుగా, ఒకరి వెనుక ఒకరు లైన్లో నిలబడి, మాస్కులు పెట్టుకొని, గంటల తరబడి ఎదురు చూస్తూ… మరొకపక్క చిన్న పిల్లలను సముదాయిస్తూ, ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలించక మంచు కురుస్తున్న కూడా సహనంతో నిలబడి ఉన్న ఆ ప్రజలను చూస్తే పాపం అనిపిస్తోంది

కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ క్యూ చూస్తుంటే బాహుబలి క్రేజ్ ను కరోనా వైరస్ బ్రేక్ చేసినట్లే అనిపిస్తోంది అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All