Homeటాప్ స్టోరీస్రామ్ గోపాల్ వర్మకు తగిలిన కరోనా వైరస్ సెగ

రామ్ గోపాల్ వర్మకు తగిలిన కరోనా వైరస్ సెగ

RGV facing Coronavirus Effect
RGV facing Coronavirus Effect

టైటిల్ చూసి రామ్ గోపాల్ వర్మ కి కరోనా వైరస్ వచ్చిందేమో.?  అని ఆనంద పడకండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన్ని గనుక కుడితే తేలు;  ఒకవేళ కరిస్తే పాము; ఒకవేళ వస్తే వైరస్… అవి చచ్చిపోవాల్సిందే తప్ప గురువు గారికి కనీసం గడ్డం లో ఉండే తెల్ల వెంట్రుక కూడా ఓడిపోదు. మరి ఇప్పుడు విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ  గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమా చేస్తున్నారు ఆ సినిమా పేరు “ఎంటర్ ద  గర్ల్ డ్రాగన్.”

ఇక ఈ సినిమాలో ప్రేమ, వ్యామోహం, ఆకర్షణ, పగ, ప్రతీకారం లాంటి అంశాలను మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ అనే అంశానికి ఒక రకమైన దేవుడు లాంటి బ్రూస్ లీ కి ఇచ్చే ఒక ట్రిబ్యూట్ మాదిరిగా ఈ సినిమాను డిజైన్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వరకు చైనా వెళ్లి షూటింగ్ చేయాలి. బ్యూటిఫుల్ అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా పనిమీద చైనా వెళ్లారు. ఇంతలో అనుకోకుండా అక్కడ కరోనా వైరస్ ప్రభావం చూపించి, అన్ని బిజినెస్ లతో పాటు అన్ని రకాల సినిమా షూటింగ్ లకు అంతరాయం ఏర్పడింది. ఇక కొద్దిగా ప్యాచ్ వర్క్ మినహా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, “ఎంటర్ ద గర్ల్ డ్రాగన్” సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే.

- Advertisement -

 మిగిలిన కొంచెం బ్యాలెన్స్ వర్క్ చైనాలో షూట్ చేయాలి దానికి ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. మరోవైపు చూస్తే గురువుగారు పరిస్థితులకు కాంప్రమైజ్ అవ్వని  వ్యక్తి. ప్రస్తుతం అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఈ కరోనా వైరస్ అనేది తగ్గాలంటే కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి మనం లెక్కలు పరిశీలించినట్లయితే అమెరికా వాడికి ఎప్పుడు డబ్బులు తగ్గుతాయో.?  అప్పుడు ప్రపంచం లోకి ఒక కొత్త వైరస్ బయటకు రావడం అందరికీ తెలిసిన విషయమే.

 మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో “ఎంటర్ ద గర్ల్ డ్రాగన్” సినిమా బ్యాలెన్స్ వర్క్ చైనా లో షూట్ చేస్తారా.?  లేకపోతే వేరే లొకేషన్లను వెతుక్కొని సినిమాని కంప్లీట్ చేస్తారా.? అనేది ఆర్జీవీ ముందు ఉన్న ప్రశ్న.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All