Homeటాప్ స్టోరీస్కరోనా వైరస్ పై “నాని” షాకింగ్ కామెంట్స్

కరోనా వైరస్ పై “నాని” షాకింగ్ కామెంట్స్

కరోనా వైరస్ పై “నాని” షాకింగ్ కామెంట్స్
కరోనా వైరస్ పై “నాని” షాకింగ్ కామెంట్స్

కరోనా వైరస్  పంచ వ్యాప్తంగా ప్రజలను బాగా ఇబ్బంది  పెడుతోంది. అన్ని రకాల వృత్తి,ఉద్యోగ,వ్యాపార వ్యవహారాలతో బిజీగా ఉండే మనుషులను చేతులు కట్టేసి ఇంట్లో కూర్చో పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు,నాలుగు స్టేజ్ లలో ఉన్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతదేశంలో రెండో స్టేజ్ లో ఉంది. ఈ దశలో వైరస్ ను సమర్ధంగా ఎదుర్కోవడం కంటే… వైరస్ బారిన పడకుండా మన పనులను కొంతకాలం తాత్కాలికంగా వాయిదా వేసుకుని జాగ్రత్తగా ఉండటంమంచిదని ఆరోగ్య నిపుణులు శాస్త్రవేత్తలు డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా మూడు,నాలుగు స్టేజ్ లలో కరోనా వైరస్ మహమ్మారిలా మారే అవకాశం ఉంది. ఒకవేళ పొరపాటున అలా గనుక జరిగినట్లయితే ఇతర దేశాల్లో జరిగినట్లు మన దేశంలో కూడా అపారమైన ప్రాణ నష్టం జరుగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీకి కరోనా వైరస్ చేసిన నష్టం అంతా ఇంతా కాదు. విడుదల తేదీ తో సహా అన్నీ సిద్ధం అయిన సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల భాషలలో అన్ని రకాల ఇండస్ట్రీ లకు సంబంధించిన సినిమాలు షూటింగ్ రద్దు చేయబడ్డాయి.

- Advertisement -

నటీనటులు టెక్నీషియన్లను మినహాయిస్తే ముఖ్యంగా సినిమాలకు పని చేసే 24 విభాగాలకు సంబంధించి నటువంటి కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి ఉండదు కాబట్టి ఇబ్బంది పడతారు. ఇక సినిమా తారలు కూడా విలక్షణంగా వారి వారి స్థాయికి తగ్గట్లు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై అవగాహన కల్పించే విధంగా అభిమానులను ఉద్దేశించి పోస్టు పెట్టాడు.

“పాలిటిక్స్,కులం,మతం,పవర్,డబ్బు,ఫేమ్,తొక్క తోలు ఏమీ ఉండవు. చివరకు మనిషికి మనిషే. ఒక మనిషికి ఏ కష్టమొచ్చినా సాటి మనిషి వచ్చి సహాయపడాలి. మనిషిని ఒక మనిషి మాత్రమే ఆదుకోవాలి. మనందరం ఒక పెద్ద కుటుంబం. అంతా కలిసి మెలిసి ఉందాం. జాగ్రత్తగా ఉందాం.! భావోద్వేగపరమైన సందేశాన్ని షేర్ చేశారు నాని.

గతంలో కూడా కరోనా వైరస్ వల్ల ఆయన ప్రస్తుత సినిమా వి షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో “మార్చిలో కరోనా వైరస్ ను చంపేసి ఏప్రిల్లో పండగ చేసుకుందాం” అని పోస్ట్ పెట్టాడు నాని.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All