Homeటాప్ స్టోరీస్కరోనా వైరస్ వస్తుందని 9 ఏళ్ళ క్రితం చెప్పిన ఆ సినిమా

కరోనా వైరస్ వస్తుందని 9 ఏళ్ళ క్రితం చెప్పిన ఆ సినిమా

కరోనా వైరస్  వస్తుందని 9 ఏళ్ళ క్రితం చెప్పిన ఆ సినిమా
కరోనా వైరస్ వస్తుందని 9 ఏళ్ళ క్రితం చెప్పిన ఆ సినిమా

ఈ దశాబాన్ని ఇక కరోనా కు ముందు – కరోనా కు తర్వాత అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాత్రమే కాదు. కరోనా ఎఫెక్ట్ తో ఇంట్లో కూర్చున్న మన ప్రజలలో కొంతమంది వాట్సప్ యూనివర్సిటీ వేదికగా అనేకరకాల విజ్ఞాన ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా జనాలు చర్చించుకుంటున్నారు. ఆ సినిమాలో కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చూపించడం విశేషం. అయితే పేర్లు మార్పు. కానీ ఆ సినిమాలో చూపించిన అనేక సీన్ లు కరోనా కు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఆ సినిమా పేరు “కంటేజియన్”.కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం కంటేజియన్ సినిమాకు డౌన్‌లోడ్లు భారీగా పెరిగాయి. 2011లో విడుదలైన కంటేజియన్ పెద్ద హిట్ కాలేదు. గత కొన్నివారాలుగా ఈ సినిమాను వీక్షించేవారి సంఖ్య భారీగా పెరిగింది.

కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తక్కువ సమయంలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన సినిమాల జాబితాలోకి కంటేజియన్ వచ్చి చేరింది. అసలు గత ఏడాది చైనాలో కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తికి సంబంధించి డిసెంబరులో మొదట వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో, ఒక అమ్మాయి అకస్మాత్తుగా ఓ ప్రమాదకర వైరస్ భారిన పడి చనిపోతుంది. చైనా పర్యటనలో ఉన్నప్పుడు ఆమెకు ఆ వైరస్ సోకుతుంది. తర్వాత ఆ వైరస్ ప్రపంచవ్యాప్తంగావ్యాపిస్తుంది. కరోనావైరస్ వ్యాప్తి కూడా చైనాలోనే మొదలైంది. సినిమాలో వైరస్ పేరు ఎంఈవీ-1. గబ్బిలం ద్వారా వ్యాప్తి చెందే ఆ వైరస్ మొదట పందికి సోకుతుంది. ఆ పంది మాంసాన్ని తాకిన ఓ హాంగ్‌కాంగ్ చెఫ్‌ హీరోయిన్ కు షేక్‌హ్యాండ్ ఇస్తారు. అలా ఆ వైరస్ ఆమెకు కు సంక్రమిస్తుంది. ఆమె, తన కొడుకు కూడా చనిపోతారు. ఆమెకు భర్తగా నటించిన వ్యక్తి మాత్రం రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండటంతో ఆయన ప్రాణాలతో బయటపడతారు. కంటేజియన్ సినిమాలో చెప్పినట్లుగానే కోవిడ్-19 వైరస్ చైనా నగరమైన వూహాన్‌లో మొదట జంతువుల నుంచి మనుషులకు సంక్రమించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కంటేజియన్ సినిమాలో పందిని వైరస్ కు పరాసైట్ గా చూపించారు. వూహాన్ లో జంతువుల మాంసం అమ్మే మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని చైనా అధికారులు గుర్తించారు. సినిమాలో క వైరస్‌ సోకినవారికి శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయని సినిమాలో చూపించారు. కరోనావైరస్‌తోనూ అలాంటి సమస్యలే వస్తున్నాయి. అయితే, సినిమాలో ఎంఈవీ-1ను నిపా వైరస్ కుటుంబానికి చెందినదని చెప్పారు.

- Advertisement -

కంటేజియన్‌ సినిమాలో వైరస్ బారినపడి నెల రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 2.6 కోట్ల మంది చనిపోతారు. సినిమాలో వైరస్ సోకిన లక్షణాలు కనిపించిన వారిని ఐసోలేషన్ వార్డులలో ఉంచి పరీక్షిస్తారు. సినిమాలో అమెరికాలోని ఛికాగో నగరాన్ని పూర్తిగా మూసివేస్తే.. కరోనావైరస్ ప్రభావంతో చైనాలోని వూహాన్ నగరాన్ని మూసివేశారు. మన తెలుగులో కూడా ఏ.ఆర్ మురుగదాస్ గారు “7th సెన్స్” సినిమాలో “హంటా” వైరస్ గురించి, అది కూడా చైనా నుండే వచ్చిన విషయాన్నీ ప్రస్తావించారు. ఏదీ ఏమైనా మనుషులు తమ సొంత ప్రయోజనాల కోసం సాటి మనుషులను చంపి వ్యాపారం చేసే ఒక లైన్ అనేది అప్పటికీ.. ఇప్పటికీ రిలవెంట్. మనం చెప్పలేని నిజాలను సినిమాలో అయినా చూపించి ప్రజలకు సత్యం తెలియచెయ్యాలనేది కొంతమంది మనుషుల తాపత్రయం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All