Homeగాసిప్స్రవితేజ హీరోగా రామ్ చరణ్ నిర్మాణం

రవితేజ హీరోగా రామ్ చరణ్ నిర్మాణం

రవితేజ హీరోగా రామ్ చరణ్ నిర్మాణం
రవితేజ హీరోగా రామ్ చరణ్ నిర్మాణం

మాస్ మహారాజా రవితేజ క్రాక్ ఒక్క హిట్టుతో మళ్ళీ తన కెరీర్ ను హైవే మీద నిలబెట్టాడు. వరసగా రవితేజకు అవకాశాలు వస్తున్నాయి. ఖిలాడీ చిత్రాన్ని పూర్తి చేసిన రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిటయ్యాడు. అలాగే త్రినాథరావు నక్కిన, మారుతి దర్శకత్వాలలో సినిమాలు లైన్లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే రవితేజ హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ చిత్ర రీమేక్ హక్కులను రామ్ చరణ్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో కీలకమైన పృథ్వీరాజ్ పాత్రను ఎవరు పోషిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ముందుగా రామ్ చరణ్ స్వయంగా నటిస్తాడు అన్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ పేరు సైతం తెర మీదకు వచ్చింది కానీ ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం హీరో అయిన పృథ్వీరాజ్ క్యారెక్టర్ ను రవితేజ పోషించనున్నాడట. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All