Homeగాసిప్స్బాలయ్య, రవితేజ... ఒకరి దర్శకులతో మరొకరు

బాలయ్య, రవితేజ… ఒకరి దర్శకులతో మరొకరు

బాలయ్య, రవితేజ... ఒకరి దర్శకులతో మరొకరు
బాలయ్య, రవితేజ… ఒకరి దర్శకులతో మరొకరు

నందమూరి బాలకృష్ణ, రవితేజ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని ఎప్పటినుండో ఒక రూమర్ ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ వీరిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడినప్పుడు మాత్రం ఒకింత ఉత్సాహం కచ్చితంగా ఉంటుంది. ఈ ఏడాది కూడా ఖిలాడీ, అఖండ చిత్రాలతో వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద తలపడేవారే కానీ కోవిడ్ కారణంగా సినిమాల రిలీజ్ డేట్లు అన్నీ తారుమారయ్యాయి.

తాజా సమాచారం విషయానికొస్తే బాలయ్య అఖండ పూర్తైన తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీన్ని దర్శకుడు ధృవీకరించాడు కూడా. రవితేజతో క్రాక్ తీసి మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య సినిమాపై వర్క్ చేస్తున్నాడు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే షూటింగ్ కూడా మొదలైపోతుంది.

- Advertisement -

అలాగే రవితేజ సినిమా భద్ర ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను మరోసారి రవితేజతో పనిచేయబోతున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం అఖండ చిత్రంతో బిజీగా ఉన్న బోయపాటి తర్వాత రవితేజకు కథ వినిపించనున్నాడట. మరి చూడాలి ఇది ఎంతవరకూ జరుగుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All