Homeగాసిప్స్ఎన్టీఆర్ కు భిన్నమైన రూట్ లో వెళ్తోన్న చరణ్

ఎన్టీఆర్ కు భిన్నమైన రూట్ లో వెళ్తోన్న చరణ్

ఎన్టీఆర్ కు భిన్నమైన రూట్ లో వెళ్తోన్న చరణ్
ఎన్టీఆర్ కు భిన్నమైన రూట్ లో వెళ్తోన్న చరణ్

ఇండస్ట్రీలో టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. హీరోలుగా ఇద్దరూ టాప్ స్థాయిలో కొనసాగుతున్నారు. ఇద్దరు హీరోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇలా ఇద్దరు టాప్ హీరోలు ఒకే సినిమాలో నటించడం ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో జరగలేదు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ పై చాలా అంచనాలున్నాయి. ముఖ్యంగా ఇద్దరు హీరోలను ఎలా ప్రెజంట్ చేస్తున్నారన్న దానిపై ఫిల్మ్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ షూట్ మే నెలతో పూర్తవుతుందని ప్రాధమికంగా తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం తర్వాత ఈ ఇద్దరు హీరోల తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెరిగింది.

ఈ విషయంలో ఎన్టీఆర్, చరణ్ కంటే ముందున్నాడు. ఇప్పటికే తన తర్వాతి చిత్రాన్ని కన్ఫర్మ్ చేసేసాడు. తనతో అరవింద సమేత చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తర్వాతి చిత్రాన్ని చేయనున్నాడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. మే నుండి షూటింగ్ మొదలై వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమా విడుదల ఉంటుంది.

- Advertisement -

ఇక రామ్ చరణ్ విషయానికొస్తే ఎన్టీఆర్ కు భిన్నమైన దారిలో వెళుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత టాప్ దర్శకుడ్ని ఎన్నుకుంటే రామ్ చరణ్ మాత్రం యువ దర్శకులపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ సుజీత్ లేదా వెంకీ కుడుములు దర్శకత్వంలో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు. ఈ ఇద్దరు యువ దర్శకులు ఇప్పటికే తమ తమ లైన్స్ వినిపించారు. చరణ్ ఇద్దరినీ ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు సమాచారం. ఎవరి స్క్రిప్ట్ ముందు ఓకే అయితే వారితో ముందుకెళ్లాలని అనుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరు యువ దర్శకులలో ఎవరు చరణ్ ను డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All