Homeటాప్ స్టోరీస్అరుదైన ప్రశంస దక్కించుకున్న రామ్ చరణ్

అరుదైన ప్రశంస దక్కించుకున్న రామ్ చరణ్

అరుదైన ప్రశంస దక్కించుకున్న రామ్ చరణ్
అరుదైన ప్రశంస దక్కించుకున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా తనకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందోప్రత్యేకించి చెప్పాల్సిన పనేముంది. అప్పటిదాకా చరణ్ ను నటనాపరంగా విమర్శించిన వాళ్ళు కూడా పూర్తిగా ఫిదా అయిపోయారు. అంత గొప్పగా సాగింది చరణ్ నటన. అటు ప్రశంసలతో పాటు ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సంచలన విజయం సాధించిందీ చిత్రం. నటన విషయంలో చరణ్ ఒక్కసారిగా నాలుగైదు మెట్లు ఎక్కేసాడు. అన్ని వైపులా నుండి చరణ్ కు ఈ చిత్రం ద్వారా ప్రశంసలు దక్కాయి. అయితే 2018లో విడుదలైన సినిమా గురించి ఇప్పుడెందుకు అంటే, అలాంటి ఒక సందర్భం వచ్చింది.

సినిమా వాళ్లకు అదే రంగం నుండి ప్రశంసలు రావడం సాధారణమే. అయితే బయటి రంగాల వారు కూడా మెచ్చుకున్నప్పుడే ఆ సినిమా జనాల్లోకి ఎంత బాగా వెళ్లిందనేది అర్ధమైపోతుంది. అలాంటి ఒక సందర్భమే చరణ్ కు ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ భార్య సుధామూర్తి వల్ల వచ్చింది. ఆమె ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. సుధామూర్తి మంచి సాహిత్య అభిమాని. సినిమాలు కూడా అప్పుడప్పుడు చూస్తుంటారు ఆమె. కన్నడ సినిమాలతో పాటు వీలు కుదిరినప్పుడు తెలుగు సినిమాలు కూడా చూస్తుంటారు. ఇటీవలే ఆమె రంగస్థలం సినిమా చూశారట. అందులో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని కొనియాడారు సుధామూర్తి.

- Advertisement -

ఇంకా సినిమాల గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు అంతా ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. నా వరకూ కృష్ణుడంటే ఎన్టీఆర్ మాత్రమే. ఇప్పటికీ కళ్ళు మూసుకుని కృష్ణుడి రూపం తలుచుకుంటే ఎన్టీఆర్ రూపమే కళ్ళ ముందు ఉంటుంది. అంతలా ఆయన ప్రభావం ఉంది అని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగులో ఎన్టీఆర్ సినిమాలు కాకుండా భక్త ప్రహ్లాద, అన్నమయ్య, ఓం నమో వెంకటేశాయ, మనం వంటి సినిమాలు చూశానని ఆమె చెప్పారు. మనం కూడా తనకు బాగా నచ్చిందని కొనియాడారు. ఈ సినిమాల వరుసలోనే రంగస్థలం అనుకోకుండా వీక్షించానని, అది తనకు బాగా నచ్చిందని అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All