
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఎన్టీఆర్ పై కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ తరువాత రామ్‌చరణ్ `ఆచార్య` చిత్రంలోని కీలక అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించిన షూటింగ్ ఇంకా పునః ప్రారంభం కాలేదు. వైరస్ ప్రభావంతో మరి కొంత సమయం వేచి చూడాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారట. నవంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టే అవకాశం వుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీల తరువాత రామ్‌చరణ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడంటూ ఇటీవల ప్రచారం జరిగింది. స్టోరీ కూడా వినిపించారట.
అయితే వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్ రామ్‌చరణ్‌కి నచ్చలేదని, దాంతో యంగ్ డైరెక్టర్‌కు రామ్‌చరణ్ నో అని షాకిచ్చినట్టు తెలిసింది. `భీష్మ` హిట్‌తో తాజాగా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో వెంకీ కుడుములకు యువీ క్రియేషన్స్ తదుపరి చిత్రానికి అడ్వాన్స్ ఇచ్చిందట. చరణ్ ఇచ్చిన షాక్‌తో వెంకీ కుడుముల మరో కథతో వస్తాడా లేక మరో హీరో వైపు వెళ్లిపోతాడా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.