Homeటాప్ స్టోరీస్భీమ్ కోసం మ్యాజిక్ చేసిన‌ రామ‌రాజు!

భీమ్ కోసం మ్యాజిక్ చేసిన‌ రామ‌రాజు!

భీమ్ కోసం మ్యాజిక్ చేసిన‌ రామ‌రాజు!
భీమ్ కోసం మ్యాజిక్ చేసిన‌ రామ‌రాజు!

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్నభారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌ల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఏడు నెల‌ల విరామం త‌రువాత ఇట‌వ‌లే ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ మొద‌లైంది.

ఎన్టీఆర్‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రామ‌రాజు టీజ‌ర్‌ని రిలీజ్ చేసి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేయాల్సిన టీజ‌ర్‌ని ఈ 22న మేక‌ర్స్ రిలీజ్ చేస్తున్నారు. రామ‌రాజు టీజ‌ర్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందించిన విష‌యం తెలిసిందే. అన్ని భాష‌ల్లోనూ ఎన్టీఆర్ త‌న‌దైన స్టైల్లో వాయిస్ అందించి టీజ‌ర్‌కి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు.

- Advertisement -

ఇదే మ్యాజిక్‌ని మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ రిపీట్ చేయ‌బోతున్నారు‌. డ‌బ్బింగ్ విష‌యంలో ప్ర‌త్యేక కేర్ తీసుకున్నార‌ట రామ్‌చ‌ర‌ణ్‌. అన్ని భాష‌ల్లోనూ రామ్‌చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్ప‌డం ఈ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిల‌వ‌నుంద‌ని తెలిసింది. ఇద్ద‌రి పాత్ర‌ల్ని స‌మానంగా డిజైన్ చేసిన జ‌క్క‌న్న టీజ‌ర్‌లో సీన్‌ల‌ని కూడా అదే స్థాయిలో క‌ట్ ఏయ‌డంతో రాజ‌మౌళిని టీమ్ అంతా పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతోంద‌ట‌. రామ‌రాజు ఫ‌ర్ భీమ్ పేరుతో ఈ టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All