
`బాహుబలి` చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు రాజమౌళి. ప్రకపంచ వ్యాప్తంగా ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ చిత్రంతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూడటం మొదలుపెట్టింది. మార్కెట్ పరంగా కూడా `బాహుబలి` తెలుగు సినిమా మార్కెట్‌ని మరింతగా పెంచి క్రేజ్‌ని తీసుకొచ్చింది.
ప్రస్తుతం తెలుగులో సినిమా వస్తోందంటే దక్షిణాదితో పాటు వరల్డ్ వైడ్‌గా మార్కెట్ వర్గాలు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలుగు సినిమాకి ఇంతటి కీర్తిని, క్రేజ్‌ని తీసుకొచ్చిన జక్కన్న బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ వర్గాలు రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎనర్జిటిక్ హీరో రామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళిగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ జక్కన్నని ఆకాశానికి ఎత్తేశారు. ఎవరికైనా హిట్ వస్తే కెరీర్ మారిపోతుందని కానీ రాజమౌళికి హిట్ వస్తే ఇండస్ట్రే మారిపోతుందని అభివృద్ధి చెందుతుందన్నారు. `ఆర్ ఆర్ ఆర్` రాకింగ్ సర్ `అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు రామ్.
Here’s wishing our Pride of Indian Cinema @ssrajamouli garu a very happy birthday..
Hit vaste career grow avutundhi..kaani eyanaki Hit vaste Industry motham grow avutundhi..?
Keep #RRRocking sir!
Love..#RAPO
— RAm POthineni (@ramsayz) October 10, 2020