
స్టార్ హీరో రామ్‌చరణ్ వైఫ్ ఉపాసన తను ఏం చేయాలని భావిస్తుందో అదే చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తమ ఫ్యామిలీకి సంబంధించిన అపోలో హాస్పిటల్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమాజం పట్ల తను చేయాలనుకున్న కార్యక్రమాల్లో ఆల్గొంటోంది. కరోనా వైరస్‌పై ఆన్ లైన్‌లో అవగాహన కల్పిస్తూనే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు.
వణ్య ప్రాణుల సంరక్షణ కోసం ముందుకొచ్చిన ఉపాసన తాజాగా `యువర్ లైఫ్` పేరులో ఓ వెబ్ సైట్‌ని ప్రత్యేకంగా స్టార్ట్ చేసింది. దీనికి స్టార్ హీరోయిన్ సమంతని అతిథి ఎడిటర్‌గా నియమించడమే కాకుండా ఆమెతో వంటు చేయిస్తూ చాలా మందిలో పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పిస్తోంది. ఇటీవల సమంతతో కలిసి ఉపాసన చేసిన వంటకాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే తాజాగా ఉపాసన `మన ఊరు మన బాధ్యత` పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించాలన్న సంకల్పింతో ఉపాసన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతే కాకుండా దివ్యాంగుల్లో వున్న డ్యాన్సింగ్ స్కిల్స్‌ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న సదుద్దేశంతో `హీల్ యువర్ లైఫ్ త్రూ డ్యాన్స్` అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఆన్ లైన్ షోకి హోస్ట్‌గా స్టార్ హీరో రామ్‌చరణ్ వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు ప్రభుదేవా, ఫరా ఖాన్ కూడా వ్యవహరించనున్నారు. ఉపాసన కోసం ముగ్గురు కలిసి ఈ షోని సక్సెస్ చేయబోతున్నారట.