Homeటాప్ స్టోరీస్రామ్‌చ‌ర‌ణ్‌ లుక్ టెర్రిఫిక్‌!

రామ్‌చ‌ర‌ణ్‌ లుక్ టెర్రిఫిక్‌!

రామ్‌చ‌ర‌ణ్‌ లుక్ టెర్రిఫిక్‌!
రామ్‌చ‌ర‌ణ్‌ లుక్ టెర్రిఫిక్‌!

మెగాప‌వ‌ర్‌స్టార్ లుక్‌పై కెరీర్ ప్రారంభంలో చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. లుక్ ప‌రంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మ‌రింత మ్యాన్లీగా చ‌ర‌ణ్ వుంటార‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఆ విమ‌ర్శ‌ల‌పై స్పందించ‌ని చ‌ర‌ణ్ వాటిని సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టున్నారు. క్ర‌మ క్ర‌మంగా త‌న లుక్‌పై మేకోవ‌ర్‌పై ప్ర‌త్యేక దృష్టిని పెట్ట‌డం మొద‌లుపెట్టారు. అది `ధృవ‌` మూవీలో స్ప‌ష్టంగా క‌నిపించింది. దానికి నిద‌ర్శ‌నం అందులోని చ‌ర‌ణ్ మేకోవ‌రే.

గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఇందులో చ‌ర‌ణ్ క‌నిపించారు. ఇక `రంగ‌స్థ‌లం`లోని చిట్టిబాబు క్యారెక్ట‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మేకోవ‌ర్ విష‌యంలో మ‌రింత ప‌రిణ‌తి క‌నిపించింది. తాజాగా `ఆర్ ఆర్ ఆర్` (ర‌ణం రౌద్రం రుథిరం) లో బెస్ట్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. చ‌ర‌ణ్‌కి ఎలా వుంటే మ‌రింత బెస్ట్‌గా క‌నిపిస్తానో పూర్తిగా ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్టుంది. స్టైలిస్ట్‌ల స‌హ‌కారంతో అల్లూరి సీతారామ‌రాజు క్యారెక్ట‌ర్ కోసం బెస్ట్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

- Advertisement -

దీనికి సంబంధించిన ఓ పిక్‌ని రామ్‌చ‌ర‌ణ్ బుధ‌వారం రాత్రి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. మీసం మెలేసి అల్లూరి లుక్‌లో క‌నిపిస్తున్న ఫొటోకి Be the best possible version of yourself అనే క్యాప్ష‌న్ ఇవ్వ‌డం అభిమానులకు రోమాంచితంగా వుంద‌ట‌. ఇటీవ‌ల పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజ‌ర్‌లో చ‌ర‌ణ్ సూప‌ర్ లుక్‌లో అబ్బుర ప‌రిచే మేకోవ‌ర్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఆయ‌న క‌నిపించిన స‌న్నివేశాలు రోమాంచితంగా వుంబోతున్నాయ‌ని చిన్న హింట్ ఇవ్వ‌డంతో ఆ స‌న్నివేశాల్ని త‌లుచుకున్న అభిమానుల‌కు గూస్ బంప్స్ వ‌స్తున్నాయ‌ట‌. చ‌ర‌ణ్ తాజా లుక్ చూసిన వాళ్లంతా లుక్ టెర్రిఫిక్‌గా వుంద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All