Homeటాప్ స్టోరీస్మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - బర్త్ డే స్పెషల్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ – బర్త్ డే స్పెషల్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - బర్త్ డే స్పెషల్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ – బర్త్ డే స్పెషల్

తండ్రి మెగాస్టార్ ; బాబాయ్ పవర్ స్టార్. ఇక ఇద్దరి టాలెంట్ కలయికగా టాలీవుడ్ లో అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని, రెండో సినిమాకు రికార్డులు సృష్టించాడు ఆ  కుర్రాడు. ఆ తరువాత కొనసాగిన సినిమా ప్రయాణంలో కొన్ని పరాజయాలు అప్పుడప్పుడూ పలకరించినా, మళ్ళీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ, జయాపజయాలకు అతీతంగా ఒక పరిపూర్ణమైన నటుడిగా మారాడు రామ్ చరణ్ తేజ్.తనను నటుడిగా లాంచ్ చేసిన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారిని రెండో సారి “ఖైదీ నెం 150” సినిమాతో రీ లాంచ్ చేసారు చరణ్. ఇక నటుడిగా, నిర్మాత, బిజినెస్ మ్యాన్ గా అడుగుపెట్టిన ప్రతీ రంగంలో విజయాలు సాధిస్తూ, తనను ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు మెగాపవర్ స్టార్.

చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమైన, సొంతమైన ఒక టిపికల్ మ్యానరిజం ని చరణ్ గారు తన స్టైల్ లో సినిమాలో ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు చిరుత సినిమాలో హీరోయిన్ “నీ పేరేంటమ్మా..?” అని అడిగినప్పుడు కోపం,ప్రేమ  కలగలిపిన ఒక రకమైన ఎక్స్ ప్రెషన్ తో “చరణ్” అని చెప్పే సీన్ దీనికి ఉదాహరణ. అదే విధంగా చిరుత సినిమా ఇంట్రడక్షన్ ఫైట్ లో కూడా ఫైట్ మధ్యలో విలన్స్ వైపు చూసే ఒక రకమైన లుక్.. ఇలా ఒక ఈజ్ తో ఉండే బాడీ లాంగ్వేజ్ ఆయన సొంతం.

- Advertisement -

మగధీర సినిమాలో హీరోయిన్ బస్ లో వెళ్తూ ఉంటే, గుర్రం మీద చేజ్ చేస్తూ, వస్తున్న సీన్ లో, గుర్రం మీద నుండి పడిపోతునట్లుగా ఆయన చేసిన ఫీట్ నిజంగానే చాలా ప్రమాదకరమైనది. ఇక మగధీర సినిమాలో బైక్ స్టంట్, యాక్షన్ సీన్స్ లో స్టంట్స్ తోపాటు, హై లెవల్ ఎమోషనల్ సీన్స్ లో సూపర్ అనిపించాడు చరణ్.

ఇక ఆరెంజ్ సినిమాలో సైతం ఆయన స్టైల్, యాక్షన్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. “రచ్చ” సినిమాలో “బెట్టింగ్ రాజ్” క్యారెక్టర్ లో ఎంత ఇన్వాల్ అయ్యాడంటే… ఒక సీన్ లో తమన్నా నువ్వు కూడా స్నానం చెయ్యవా.? అని అడిగితే… “నేను రెండు రోజులకు ఒకసారే చేస్తా… మా బస్తీలో నీళ్ళు అప్పుడే వస్తాయ్..!” అని అంటాడు. చరణ్ లాంటి హీరో అలాంటి డైలాగ్స్ చెప్పడానికి ఒప్పుకోవడం మామూలు విషయం కాదు. “నాయక్” సినిమాలో “బ్రహ్మానందం” తో పోటీ పడి హాస్యం పండించాడు. ఇక “ఎవడు” సినిమాలో మూడు రకాల వేరియేషన్స్ ని బ్యాలెన్స్ గా చూపించారు చరణ్.

ఇక, కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన “గోవిందుడు అందరి వాడేలే” సినిమాలో ఒక పాటలో “ఈ ఇంటిలో మనవడినై…” అని మళ్ళీ ప్రకాష్ రాజ్ పాత్ర సందేహంగా చూసినప్పుడు “ఈ ఇంట్లో మనవాడినై…” అని పాడే ఆ సందర్భంలో నిజంగా రామ్ చరణ్ తేజ్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది.

ధృవ సినిమాలో సెట్టిల్ద్ హీరోఇజం చూపించిన రామ్ చరణ్ తేజ్, ఆ తర్వాత వచ్చిన  “రంగస్థలం” సినిమాలో చిట్టిబాబు గా తన నట విశ్వరూపం చూపించాడు. ఒక సగటు పల్లెటూరి కుర్రాడి అమాయకత్వం,మంచితనం; తనకు జరిగిన అన్యాయం పై కోపం;  తను బాగా ఇష్టపడిన రామలక్ష్మి పై ప్రేమ;  తన కష్ట సుఖాలు పంచుకునే రంగమ్మత్త తో చిలిపితనం; అన్నయ్య చనిపోయినప్పుడు బాధ; తన అన్నయ్యను ఎవరు చంపారో తెలియక, అన్నయ్య చెప్పినది వినపడక నిస్సహాయత;  దెబ్బకు దెబ్బ తీసే పగ, మొండితనం… ఇలా అన్ని రకాల భావాలను పలికించారు.

ఇప్పుడు రాజమౌళి గారు తెరకెక్కిస్తున్న R.R.R సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు రామ్ చరణ్. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ లనూ, టెక్నీషియన్ లనూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, నిజజీవితంలో ఎంతోమందికి  సహయం చేసే మంచి మనసున్న వ్యక్తి రామ్ చరణ్ తేజ్. ఇక రాబోయే రోజుల్లో నటుడిగా, నిర్మాతగా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ వ్యక్తి అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All