Homeటాప్ స్టోరీస్స్నేహితులు బంధువులు కాబోతున్నారా?

స్నేహితులు బంధువులు కాబోతున్నారా?

Ram charan and Sharwanand become brothers?
Ram charan and Sharwanand become brothers?

టాలీవుడ్ హీరోల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీనే కాదు మంచి అనుబంధం కూడా వుంటుంద‌ని మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ హీరో శ‌ర్వానంద్‌ల స్నేహం చాలా సంద‌ర్భాల్లో రుజువు చేసింది. చిన్న నాటి నుంచి వీరిద్ద‌రూ మంచి స్నేహితులు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌మ అనుబంధాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. అయితే గ‌త కొన్నేళ్లుగా స్నేహితులుగా వున్న ఈ ఇద్ద‌రు త్వ‌ర‌లో బంధువులు కాబోతున్నారా? అంటే తాజాగా జరుగుతున్న ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి.

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. యంగ్ హీరోలంతా వ‌రుస‌గా వివాహాల‌కి సై అంటూ షాకిస్తున్నారు. తాజాగా ఈ జిబితాలో యంగ్ హీరో శ‌ర్వానంద్ కూడా చేర‌బోతున్నారు. గ‌త కొంత కాలంగా ప్రేమిస్తున్న స్నేహితురాలినే శ‌ర్వా వివాహం చేసుకోబోతున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చారం మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే ఆమె మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ వైఫ్ ఉపాస‌నకు బంధువ‌ని తెలిసింది.

- Advertisement -

దీంతో గ‌త కొంత కాలంగా స్నేహితులుగా వున్న రామ్‌చ‌ర‌ణ్, ‌‌శ‌ర్వానంద్ బంధువులుగా మార‌బోతున్నార‌ని తెలుస్తోంది. శ‌ర్వానంద్ పెళ్ల‌డ‌నున్న యువ‌తి ఉపాస‌నకు స్వ‌యానా బంధువు. దీంతో ఈ పెళ్లి ప్ర‌పోజ‌ల్‌ని హీరో రామ్ చ‌ర‌ణ్ వెన‌కుండి న‌డిపిస్తున్నార‌ట‌. ఇరు కుటుంబాల‌కు ఈ పెళ్లి అంగీకారం కావ‌డంతో త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ చెప్ప‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తంది. శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం 14 రీల్స్ ప్ల‌ప్ సంస్థ నిర్మిస్తున్న `శ్రీ‌కారం` చిత్రంలో న‌టిస్తున్నారు. అజ‌య్ భూప‌తి `మ‌హాస‌ముద్రం, యువీ క్రియేష‌న్స్ చిత్రాలు ఇంకా ప్రారంభ ద‌శ‌లోనే వున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All