Homeన్యూస్రామ్ అసుర్ మూవీ రివ్యూ

రామ్ అసుర్ మూవీ రివ్యూ

రామ్ అసుర్ మూవీ రివ్యూ
రామ్ అసుర్ మూవీ రివ్యూ

నటీనటులు: అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఫైట్స్‌: శ‌ంక‌ర్‌
నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ,
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు,ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: నవంబర్ 19, 2021

ఈమధ్య కాలంలో ఏ సినిమా చూసినా అందులో కథ లేక సన్నివేశం ఏదో ఒకటి గతంలో చూసిన సినిమాను గుర్తుకుతెస్తుంది. ఈ విషయంలో ఎవ్వర్నీ తప్పుపడ్డడానికేం లేదు. కథల కొరత అలా ఉంది మరి. ఇలాంటి టైమ్స్ లో కూడా ఓ కొత్త కథను టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం చేసింది రామ్ అసుర్ (పీనట్ డైమండ్) సినిమా. కథ మొత్తం ఓ డైమండ్ చుట్టూ తిరుగుతుంది. దాన్ని పీనట్ డైమండ్ అని కూడా అంటారు. డైమండ్ చుట్టూ తిరిగే కథకు 2 జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమా ప్రత్యేకత.

- Advertisement -

రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేడు. అదే టైమ్ లో గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇవ్వడంతో బాగా డిస్టర్బ్ అవుతాడు. ఎలాగైనా జీవితంలో కోలుకోవాలనే ఉద్దేశంతో ఫ్రెండ్ సాయంతో పెద్దాయన రామాచారిని కలుస్తాడు. ఆయన సూచన మేరకు సూరి (అభినవ్ సర్దార్) అనే వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూరికి, రామ్ కు సంబంధం ఏంటి? అస్సలు సంబంధం లేని వీళ్లిద్దరి జీవితాలు ఎలా కలిశాయి? ఫైనల్ గా రామ్, పీనట్ డైమండ్ ను తయారుచేశాడా లేదా? రామ్ రాకతో సూరి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ కథలో చాలా కొత్తదనం ఉంది. కృత్రిమంగా డైమండ్ తయారుచేయడమనే కాన్సెప్టే కొత్త అనుకుంటే.. ఆ కాన్సెప్ట్ కు రెండు విభిన్న జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమాకు మరింత కొత్తదనం తీసుకొచ్చింది. అయితే ఇంత మంచి కాన్సెప్ట్ ను తెరపైకి పకడ్బందీగా తీసుకొచ్చారా అంటే మాత్రం పూర్తిగా అవునని చెప్పలేం. బడ్జెట్ పరిమితులు ఓవైపు, బలమైన స్టార్స్ లేకపోవడం మరోవైపు ఈ సినిమాను కాస్త వెనక్కి లాగినట్టు అనిపిస్తాయి.

ఉదాహరణకు ఫస్టాఫ్ నే తీసుకుంటే, రామ్ కార్తీక్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అతడి లవ్ ట్రాక్, రొమాన్స్ కు ఎక్కువ స్పేస్ ఇచ్చారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేవరకు కథ స్లోగా సాగుతుంది. అయితే ఎప్పుడైతే సెకెండాఫ్ స్టార్ట్ అవుతుందో ఇక అక్కడ్నుంచి ”రామ్ అసుర్” పరుగులుపెడుతుంది. ఈ విషయంలో దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణను మెచ్చుకోవాలి. తొలి సినిమాకే కాస్త క్లిష్టంగా, కష్టంగా అనిపించే కథను సెలక్ట్ చేసుకున్న వెంకటేష్.. సెకండాఫ్ నుంచి తన రైటింగ్ పవర్ చూపించాడు. స్క్రీన్ ప్లేలో, ట్విస్టుల్లో చమక్కులు చూపించాడు. సినిమా ఎండింగ్ లో కూడా డైరక్టర్స్ కట్ కనిపిస్తుంది.

నటీనటుల విషయానికొస్తే, రామ్ కార్తీక్ ఎప్పట్లానే రొమాంటిక్ బాయ్ గా కనిపించాడు. సూరి పాత్ర పోషించిన అభినవ్ సర్దార్ మాత్రం ది బెస్ట్ ఇచ్చాడు. ఓ షేడ్ లో లవర్ బాయ్ గా, మరో షేడ్ లో ఎగ్రెసివ్ లుక్ లో సర్దార్ యాక్టింగ్ బాగుంది. షెర్రీ అగర్వాల్ తన గ్లామర్ డోస్ తో ఆకట్టుకోగా.. చాందిని తమిళరాసన్ తన పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసింది. రామాచారిగా శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్, శివ పాత్రలో షానీ సాల్మన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా చూసుకుంటే.. భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శంకర్ ఫైట్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ విభాగాలన్నింటినీ వెంకటేష్ త్రిపర్ణ చూసుకున్నాడు. మొదటి సినిమాకే ఇన్ని బాధ్యతల్ని భుజాన వేసుకున్న ఈ డైరక్టర్.. తనకున్న బడ్జెట్ పరిమితుల్లో ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే.. ఈ మల్టీస్టారర్ కథకు కాస్త స్టార్ ఎట్రాక్షన్ ఉన్న హీరోలు పడితే, రామ్-అసుర్ సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉండేది. మొత్తమ్మీద దర్శకుడిగా తన పట్టు ఏంటో తొలి సినిమాతోనే చూపించాడు వెంకటేష్.

ఓవరాల్ గా రామ్ అసుర్ సినిమా, టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ కొత్త కథను పరిచయం చేస్తుంది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. పరిచయమున్న నటీనటులు లేనప్పటికీ.. సెకండాఫ్ నుంచి ఈ సినిమా ఆడియన్స్ కు ఫుల్ థ్రిల్ అందిస్తుంది. ఈ వీకెండ్ రిలీజైన సినిమాలు అన్నింటిలో ఇది కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుంది.

ప్లస్ పాయింట్స్
– సరికొత్త కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్
– దర్శకత్వం
– బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– సర్దార్ పెర్ఫార్మెన్స్, సర్దార్ పై తీసిన ఎపిసోడ్స్
– రామ్ కార్తీక్, చాందిని పెర్ఫార్మెన్స్
– యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్
– ఫస్టాఫ్ లో స్లో నెరేషన్
– రామ్ కార్తీక్ పై తీసిన రొమాంటిక్ ఎపిసోడ్స్

రేటింగ్ :3/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All