Homeటాప్ స్టోరీస్రాక్షసుడు రివ్యూ

రాక్షసుడు రివ్యూ

Rakshasudu Review in Telugu
Rakshasudu Review in Telugu

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ , శరవణన్
సంగీతం : జిబ్రాన్
నిర్మాత : కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం : రమేష్ వర్మ
రేటింగ్ : 3.5/5
విడుదల తేదీ : 2 ఆగస్టు 2019

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం రాక్షసుడు. తమిళంలో సంచలన విజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించేలా ఉందా ? లేదా ? తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

కథ :
అరుణ్ కుమార్ ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ) తన కుటుంబ అవసరాల కోసం పోలీస్ ఉద్యోగం లో జాయిన్ అవుతాడు. అయితే అదే సమయంలో వరుసగా కిడ్నాప్ లు , హత్యలు జరుగుతుంటాయి. వాటిని పరిశోధించే క్రమంలో కృష్ణవేణి ( అనుపమ పరమేశ్వరన్) సహాయపడుతుంది. అసలు టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు ? ఎందుకు చేస్తున్నాడు….. ఆ హత్యల వెనకాల ఉన్న మర్మం ఏంటి ? చివరకు అతడి ఆట కట్టించారా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలైట్స్ :
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన
అనుపమ పరమేశ్వరన్
కథ
స్క్రీన్ ప్లే
సంగీతం

డ్రా బ్యాక్స్ :
ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం

నటీనటుల ప్రతిభ :
పోలీస్ అధికారి అరుణ్ కుమార్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అదరగొట్టాడు. తన లోని నటుడికి సవాల్ విసిరే పాత్ర కావడంతో తమిళ హీరో ఛాయలు ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు . అంతేకాదు అద్భుతంగా నటించాడు కూడా. ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా టీచర్ పాత్రలో అద్భుత అభినయం ప్రదర్శించింది. ఇద్దరి జోడీ కూడా బాగుంది. ఈఇద్దరి మధ్య పెద్దగా రొమాన్స్ లేకపోయినా ఆ లోటు కనిపించలేదు. ఇక సైకో గా నటించిన తమిళ నటుడు శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నిజమైన సైకో ని తలపించాడు అదే స్థాయిలో భయపెట్టాడు కూడా. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రల్లో రాణించారు.

సాంకేతిక వర్గం :
జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. విజువల్స్ బాగున్నాయి. ఇక నిర్మాణ విలువలు సైతం అద్భుతంగా ఉన్నాయి. ఇక దర్శకుడు రమేష్ వర్మ విషయానికి వస్తే…… తమిళ మాతృక ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడం తో ఎక్కడా ఆ టెంపో మిస్ కాకుండా ప్రేక్షకులు ఉద్విగ్నంగా ఎదురు చూసేలా చేసాడు. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కమర్షియల్ హిట్ కొట్టాడు . మానవ మృగాళ్ల నుండి ఆడవాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సందేశాన్ని అందించాడు.

ఓవరాల్ గా :
రాక్షసుడు తప్పకుండా చూడాల్సిన సినిమా.

Click Here: Rakshasudu Movie Review in English

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All