Homeటాప్ స్టోరీస్రజనీకాంత్ పేట ట్విట్టర్ రివ్యూ

రజనీకాంత్ పేట ట్విట్టర్ రివ్యూ

Rajinikanth's Petta twitter reviewసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం ఈరోజు విడుదల అయిన విషయం తెలిసిందే . ఎనిమిదేళ్లుగా వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న హీరో రజనీకాంత్ గత ఏడాది మాత్రం 2. ఓ చిత్రంతో ఫరవాలేదనిపించాడు . అయితే కమర్షియల్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు , కట్ చేస్తే పేట చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టాడని అంటున్నారు చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు . ఈరోజుల్లో ప్రేక్షకులు స్మార్ట్ అయిపోయిన విషయం తెలిసిందే .

సినిమ చూస్తూనే అది ఎలా ఉందో ట్విట్టర్ ద్వారా రివ్యూ ఇచ్చేస్తున్నారు . నచ్చితే నచ్చింది అంటూ ట్వీట్ చేస్తున్నారు అలాగే నచ్చకపోతే అదే రేంజ్ లో ట్వీట్ చేస్తున్నారు కూడా . ఇక పేట చిత్రానికి వస్తే రజనీకాంత్ చాలాకాలం తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టేశాడని అంటున్నారు ట్వీట్ రాయుళ్లు . కొంతమంది కి ఈ సినిమా నచ్చలేదు కానీ ఎక్కువగా ట్వీట్ చేస్తున్న వాళ్లకు మాత్రం చాలా బాగా నచ్చిందట . రజనీకాంత్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు ట్వీట్ రాయుళ్లు . రజనీకాంత్ , సిమ్రాన్ , త్రిష , మేఘా ఆకాష్ , విజయ్ సేతుపతి తదితరులు నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు .

- Advertisement -

English Title: Rajinikanth’s Petta twitter review

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All