Homeఎక్స్ క్లూసివ్రజనీకాంత్ పేట సెన్సార్ టాక్

రజనీకాంత్ పేట సెన్సార్ టాక్

Rajinikanth' s Peta censor talkసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట ఈనెల 10న రిలీజ్ కానుంది . తెలుగు , తమిళ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదల అవుతోంది అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాకు పెద్దగా థియేటర్ లు లేకుండాపోయాయి దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత ఘొల్లుమంటున్నాడు . ఆ విషయం పక్కన పెడితే పేట సెన్సార్ టాక్ బాగుంది . కమర్షియల్ హిట్ అయ్యే అన్ని లక్షణాలు ఈ సినిమాకు ఉన్నాయట.

రజనీకాంత్ స్టైల్ , డైలాగ్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయని , అలాగే ఎంటర్ టైన్ మెంట్ , యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయమని అంటున్నారు . త్రిష , సిమ్రాన్ , మేఘా ఆకాష్ , విజయ్ సేతుపతి తదితరులు నటించిన పేట చిత్రంతో మళ్ళీ రజని మేనియా స్టార్ట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది . కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది .

- Advertisement -

English Title: Rajinikanth’ s Peta censor talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All