Homeటాప్ స్టోరీస్రజనీ కొత్త సినిమా “మన్నవన్” ?

రజనీ కొత్త సినిమా “మన్నవన్” ?

రజనీ కొత్త సినిమా “మన్నవన్” ?
రజనీ కొత్త సినిమా “మన్నవన్” ?

సూపర్ స్టార్ రజినికాంత్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి  రావాలని అభిమానులే కాకుండా యావత్ తమిళనాడు ప్రజల నుండి ఒత్తిడి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అదే సమయంలో రజనీకాంత్ గారు తనదైన రీసేర్చ్ టీం తో చర్చిస్తూనే, మరోవైపు త్వరగా సినిమాలు కూడా చేస్తున్నారు. ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగుపెడితే సినిమాలకు బ్రేక్ పడటంతో పాటు, కొన్ని పరిమితులు కూడా ఉంటాయి.

ఇటీవలే ఒక సందర్భంలో హిందూ దేవతలను అవమానపరిచిన ఒక సంఘం గురించి రజనీకాంత్ గారు ఒక సభలో మాట్లాడగా, సదరు నాస్తిక సమూహం వారు రజనీ ని సంజాయిషీ అడగటం జరిగింది. గతంలో మాదిరి మెత్తగా ఉండకుండా, రజనీకాంత్ కూడా కోట్లమంది మనోభావాలను దెబ్బతీసే ఆ వర్గం వారికీ చురకలు అంటించారు.

- Advertisement -

ప్రస్తుతం దర్బార్ సక్సెస్ స్వింగ్ లో ఉండగానే తలైవ తన తరవాత సినిమాను దర్శకుడు శివ తో మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ సరసన మీనా, ఖుష్బూ నటిస్తున్నారు. నటి కీర్తి సురేష్, సిద్దార్థ్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. శివ – రజనీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు “మన్నవన్” అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మన్నవన్ అంటే తమిళంలో గొప్ప రాజు అని అర్ధం.

ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే మరొక సినిమాను దర్శకుడు లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో రజనీ ఓకే చేసారని సమాచారం.  గతంలో ఇండస్ట్రీ లో పెద్దహీరోల  హైప్ వల్ల ధియేటర్ లు దొరకడం లేదనే సమస్య వచ్చినప్పుడు కావాలని వేగం తగ్గించి, పెద్ద హీరోలు నిదానంగా సినిమాలు చేసే ట్రెండ్ మొదలయ్యింది రజనీతోనే. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రజల కోరికమేరకు రజనీ సినిమాలు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజజీవితంలోకి అడుగు పెడితేనే వ్యవస్థలో కొంత మార్పు వస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All